‘అశ్వమేధం’ టీజర్ విడుదల….!

0
6

నూతన నటుడు ధృవ్ కరుణాకర్ హీరోగా నటించిన చిత్రం అశ్వమేధం. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన రావడంతో నేడు చిత్ర బృందం టీజర్ ను యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. జి.నితిన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ధృవ్ సరసన శివాంగి హీరోయిన్ గా జతకడుతోంది. ‘నేను నేను కాదు, నాకు ఉనికిలేదు, నా వృత్తే నాకు ఉనికిలేకుండా చేసింది’ అనే డైలాగ్ తో ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ఆకట్టుకుంటోంది.

అలానే ‘నాకు చదరంగం అంటే ఎంతో ఇష్టం, కానీ నా జీవితమే ఒక చదరంగంగా మారిపోయింది’ అంటూ టీజర్ లో హీరో పలికే డైలాగులు ఆకట్టుకుంటాయి. సుమ‌న్, ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్, సాన్యా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఔరోస్‌ అవతార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఐశ్వ‌ర్య యాద‌వ్, ప్రియా నాయ‌ర్ కలిసి నిర్మిస్తున్నారు. చ‌ర‌ణ్ అర్జున్ ఈ సినమాకు సంగీతాన్ని అందిస్తుండగా, జయపాల్‌ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here