కార్తికేయ ‘గుణ 369’ టీజర్ విడుదల….!!

0
71

ఆర్ఎక్స్100 మూవీ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన హీరో కార్తికేయ నటిస్తున్న కొత్త సినిమా గుణ369, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది . ఇక కాసేపటి క్రితం ఈ చిత్ర టీజర్ ని చిత్ర బృదం యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. మనం చేసే తప్పుల వలన మన జీవితానికి ఏమైనా పర్లేదు, కానీ ప్రక్కన వాళ్ళ జీవితానికి మాత్రం ఏ హాని జరుగకూడదు అంటూ, సీనియర్ నటులు సాయికుమార్ గారి వాయిస్ ఓవర్ తో ప్రారంభమయ్యే ఈ టీజర్, మంచి ఫన్, లవ్ మరియు యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది.  సినిమా మీద ఆసక్తి పెంచేలా టీజర్ ని కట్ చేసారు .

కార్తీయేక సరసన అనఘా హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు బోయ‌పాటి శిష్యుడైన అర్జున్ జంధ్యాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మిస్తుండగా, చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలానే రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here