స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రాజ్ దూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్ – కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించారు. నిర్మాణానంతర పనులు ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం జూలై5 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే విడుదలై చిత్ర టీజర్ యూట్యూబ్లో మిలియన్ వ్యూస్ అధిగమించి మంచి రెస్పాన్స్ రాబట్టింది . తొలి చిత్రమైనా మేఘాంశ్ అద్భుతంగా నటించాడని చిత్ర నిర్మాత తెలియజేస్తున్నారు. రియల్ స్టార్ వారసుడిగా మేఘాంశ్ హీరోయిక్ లుక్ అబ్బురపరుస్తోంది. హీరోయిజానికి సరిపడే డ్యాషింగ్ లుక్,రియల్ స్పార్క్ అందరినీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్.. సామాజిక మాధ్యమాలలో మేఘాంశ్ లుక్ .. అప్పియరెన్స్ పై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి టీజర్ తోనే ప్రశంసలు దక్కించుకున్న ఈ యంగ్ హీరోకి తండ్రి శ్రీహరి ఆశీస్సులతో పాటు తెలుగు సినీప్రేక్షకుల ఆశీస్సులు లభిస్తాయని మేఘాంశ్ తల్లి గారు శ్రీమతి శాంతి శ్రీహరి ఆకాంక్షించారు. రియల్ స్టార్కి మీడియా ఒక కుటుంబ సభ్యుల లాగా అండగా నిలిచారు. అలాగే ఆయన వారసుడు మేఘాంశ్కి మీడియా అండదండలు లభిస్తాయని శాంతి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకులు అర్జున్ – కార్తీక్ మాట్లాడుతూ.. మేఘాంశ్కు తొలి చిత్రమైనా తనకి సూట్ అయ్యే కథ తో చేశాం . తను చేసిన యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్గా నిలుస్తాయి. యువతకు దగ్గరయ్యేట్లు అతని పెర్ఫార్మన్స్ వుంటుందని అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో సుదర్శన్, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్, ఏడిద శ్రీరామ్, దేవిప్రసాద్, అనిష్ కురివిళ్ళ, మనోబాల, వేణుగోపాల్, దువ్వాసి మోహన్, సూర్య, రవివర్మ, చిత్రం శ్రీను, వేణు, బిహెచ్ఇఎల్. ప్రసాద్, భద్రం, జెమినీ అశోక్, మృణాల్, బిందు, రాజేశ్వరి, శిరీష, నళిని, మాస్టర్ ఈశాన్ నటించారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: విద్యా సాగర్ చింతా, ఎడిటింగ్ : విజయవర్దన్ కావూరి సంగీతం: వరుణ్ సునీల్, రచనా సహకారం: వెంకట్, డి. పాటి, పాటలు: కిట్టు విస్పాప్రగడ, రాంబాబు గోపాల, పి.ఆర్.ఓ:. సురేష్ కొండేటి, పబ్లిసిటీ: అనంత్, ఆర్ట్: మురళీ వీరవల్లి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్. కుమార్, నిర్మాత: ఎం.ఎల్.వి. సత్యనారాయణ (సత్తిబాబు). రచన, దర్శకత్వం: అర్జున్-కార్తీక్.


