యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ‘అ!’వంటి కొత్త తరహా ప్రయోగాత్మక చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించిన చిత్రం ‘కల్కి’. అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం శ్రవణ్ భరద్వాజ్.
‘పిఎస్వి గరుడవేగ’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత డా.రాజశేఖ్ హీరోగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన రాజశేఖర్ గారి ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్ కు అద్భుత స్పందన లభించింది. జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కె కె రాధ మోహన్ అందిస్తున్నారు…..
శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కె కె రాధ మోహన్ మాట్లాడుతూ – ” ‘కల్కి’ సినిమా జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా రైట్స్ ని నేను తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానేర్లో రిలీజ్ చేస్తున్నాము. దీనికి కారణం యాంగ్రీ స్టార్ రాజశేఖర్ గారి గత చిత్రం ‘గరుడ వేగ’ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మనందరికీ తెలుసు. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ తీసిన కొత్త తరహా ప్రయోగాత్మక చిత్రం ‘ అ!’ సినిమాకు ఎంతటి మంచి ఆదరనవచ్చిందో కూడా తెలుసు… ఇప్పుడు వాళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘కల్కి’. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌తో పాటు ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్‌తో పాటు సినిమా కంటెంట్ చూసి ఈ సినిమాని మా బ్యానేర్లో విడుదల చేయడానికి ముందుకు వచ్చాం. త్వరలో జరగబోయే ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో విడుదలయ్యే థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్ వర్మ ‘కల్కి’ సినిమాని రెగ్యులర్ థ్రిల్లర్ లా కాకుండా ఒక డిఫరెంట్ జోనర్ లో యదార్ధ సంఘటనతో కూడిన ఇన్వెస్టిగేటివ్ థ్రిలర్‌గా తెరకెక్కించారు. అలాగే శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ గారు ఈ సినిమాను నిర్మించారు. రాజశేఖర్ గారి యాక్షన్‌తో పాటు కామెడీ టైమింగ్ గురించి తెల్సిందే. టీజర్లో ఆయన చేసిన కామెడీ టైమింగ్ అందరిని విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ మంచి సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు దాశరథి శివేంద్ర గారి సినిమాటోగ్రఫీ మరో హైలెట్ గా నిలవనుంది. అలాగే ఇటీవల ‘బాహుబలి’ చిత్రంలో ఐటెం సాంగ్ ద్వారా పాపులర్ అయిన స్కార్లెట్ విల్సన్ ఈ సినిమాలో ప్రత్యేక గీతం ద్వారా మరో సారి యూత్‌ని ఉత్తేజపరచడానికి సిద్ధం అయ్యింది. జూన్ 28న విడుదలయ్యే ‘కల్కి’ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
యాంగ్రీ స్టార్ రాజశేఖర్, అదా శర్మ, నందితా శ్వేత, పూజితా పొన్నాడ, స్కార్లెట్ విల్సన్ రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, ‘వెన్నెల’ రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్ విల్లే, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్:కృష్ణకాంత్ (కె.కె), కాస్ట్యూమ్ డిజైనర్: అదితి అగర్వాల్, ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్, సుబ్బు, ప్రొడక్షన్ కంట్రోలర్: సలన బాలగోపాల్ రావు, చీఫ్ కో-డైరెక్టర్: మాధవ సాయి, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.


