ఈనెల 14న ‘ఇస్మార్ట్ శంకర్’ సెకండ్ సాంగ్ రిలీజ్….!

0
35

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న కొత్త సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో రామ్ సరసన స్టన్నింగ్ బ్యూటీస్ నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన రావడంతో ఇటీవల సినిమాలోని తొలిపాటను చిత్ర బృదం విడుదల చేయడం జరిగింది.

‘దిమాక్ ఖరాబ్’ అనే పల్లవితో సాగె ఆ పాటకు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించడంతో, ఈ నెల 14న రెండవ పాటను విడుదల చేయనున్నారు. ‘జిందాబాద్ జిందాబాద్’ అనే పల్లవితో సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ని ఆ రోజు సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేస్తారట. తొలిసారి పూరి, రామ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా పై టాలీవుడ్ వర్గాల్లో అలానే ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను వచ్చేనెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here