వజ్రకవచధరగోవింద సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం – హీరో సప్తగిరి.

0
847

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ సినిమాల తర్వాత స్టార్‌ కమెడియన్‌ సప్తగిరి నటించిన చిత్రం ‘వజ్రకవచధర గోవింద’. శివ శివమ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై అరుణ్‌ పవార్‌ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ పనులు మొత్తం పూర్తిచేసుకుని జూన్‌ 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్య రెండు రాష్ట్రాల్లో విడుదలచేస్తున్నారు. ఈ సందర్భంగా స్టార్‌ కమెడియన్‌ సప్తగిరి ఇంటర్వ్యూ…

వజ్రకవచధర గోవిందతో హ్యాట్రిక్‌కి సిద్దమైనట్టున్నారు?
– అవునండీ! నేను హీరోగా నటించిన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ నాకు పేరుతో పాటు డబ్బుని కూడా తీసుకు వచ్చింది. అలాగే ఆ తరువాత వచ్చిన ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ సినిమాకు నాకు నటుడిగా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ‘వజ్రకవచధరగోవింద’ సినిమా నాకు నటుడిగా మంచిపేరు అలాగే మా ప్రొడ్యూసర్స్‌కి మంచి లాభాలు తెస్తుందనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. అందుకు మీ మీడియా సపోర్ట్‌ కూడా కావాలి.

రిలీజ్‌కి ముందే మీ సినిమాకు మంచి బజ్‌ వచ్చింది కదా! ఎలా అనిపిస్తోంది?
– ఆ వేంకటేశ్వర స్వామి దయ వల్ల మా సినిమాకు మంచి బజ్‌ వచ్చింది. మాది లిమిటెడ్‌ బడ్జెట్‌ సినిమా అయినా మా టీమ్‌ అందరం చాలా కష్టపడి సినిమాను ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఒక పెద్ద బడ్జెట్‌ సినిమాగా తెరకెక్కించాం. అలాగే మా ప్రొడ్యూసర్స్‌ కూడా చాలా సపోర్ట్‌ చేశారు.

మీ గత రెండు సినిమాలకు ఈ సినిమాకు డిఫరెంట్‌ ఏంటి?
– ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాలో ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ జీవితాలలో ఉండే కష్టాలు గురించి చెప్పాము. ‘సప్తగిరిఎల్‌ఎల్‌బి’ సినిమాలో రైతులకు సంబంధించి మంచి పాయంట్‌ను ప్రేక్షకులోకి తీసుకెళ్ళాము. నా ప్రతి సినిమాలో ఎదో ఒక సోషల్‌ మెసేజ్‌ ఉండేలా చూసుకునే నేను ఇప్పుడు ఈ సినిమాలో క్యాన్సర్‌ పేషెంట్స్‌కి సంబందించిన మంచి అంశం గురించి ఎమోషనల్‌ వే లో చూపించాము.

వజ్రకవచధర గోవింద టైటిల్‌ ముందే అనుకున్నారా?
– ఈ సినిమా కథ విన్నప్పుడే ఈ టైటిల్‌ అని ఫిక్స్‌ అయ్యాం. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ పేరు గోవింద్‌. ఒక దొంగ ఒక పురాతన వజ్రాన్ని కవచంలా నిలబడి ఎలా కాపాడాడు, అసలు ఆ వజ్రానికి దొంగకి సంబంధం ఏంటి? అనేది స్టోరీ లైన్‌. అలాగే ‘వజ్రకవచధర గోవింద’ అనేది వేంకటేశ్వరుని సహస్ర నామాల్లో ఒకటి. గోవింద నామం సదా అజేయం విజయం కాబట్టి ఆ టైటిల్‌నే ఫిక్స్‌ చేశాం.

అరుణ్‌ పవార్‌తో రెండో సినిమా కదా?
– అవును. నేను ‘సప్తగిరిఎక్స్‌ప్రెస్‌’ సినిమా చేస్తున్నప్పుడే ఆయనకు మాట ఇచ్చాను. మీ డైరెక్షన్లో ఇంకో సినిమా చేస్తాను అని. ఆలా మంచి కథ కోసం వెదుకుతున్న సమయంలో జిటిఆర్‌ మహేంద్ర, పచ్చల ప్రకాష్‌, మరో వ్యక్తి కలిసి ఈ స్క్రిప్ట్‌ రెడీ చేశారు. దానికి అరుణ్‌ తన మేకింగ్‌తో పూర్తి న్యాయం చేశారు. ఆయన డైరెక్షన్‌లో చేయడం నాకు కొంత కంఫర్ట్‌.

ఈ సినిమాలో మీరు హీరోనా కమెడియనా?
– ‘వజ్రకవచధరగోవింద’ సినిమాలో నేనే హీరో..కానీ నా క్యారెక్టరైజెషన్‌ ఫుల్‌ లెంగ్త్‌ కమెడియన్‌లా ఉంటుంది. నాకు గత సినిమాల్లో స్క్రిప్ట్‌ పరంగా కామెడీ చేసే అవకాశం తక్కువ వచ్చింది. కానీ ఈ సినిమాతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించే అవకాశం దొరికింది.

హీరోగా చేస్తున్నారు కదా కమెడియన్‌గా అవకాశం వస్తే చేస్తారా?
– తప్పకుండా చేస్తాను. నేను డైరెక్టర్‌ అవుదామని ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాను. కానీ నా టైమింగ్‌, బాడీ లాంగ్వేజ్‌ చూసి నన్ను కమెడియన్‌ని చేశారు. నేను ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తప్ప ఇంకే సినిమాలో నా కామెడీ నాకు నచ్చదు.

దాదాపు ఇరవై మంది జబర్దస్త్‌ ఆర్టిస్టులను తీసుకోవడానికి కారణం?
– ఈ సినిమా క్లైమాక్స్‌లో హీరో గతం మర్చిపోయి పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. వారిలో జబర్దస్త్‌ ఆర్టిస్టులు మొత్తం కలిసి అతనికి గతాన్ని గుర్తుచేసే క్రమంలో ఒక సాంగ్‌ వస్తుంది. ఆ సాంగ్‌లో ఆ జబర్దస్త్‌ బ్యాచ్‌కి లీడర్‌గా శ్రీనివాస్‌ రెడ్డి నటించారు. ఆ సాంగ్‌తో పాటు ఇంకో రెండు మూడు సీన్లలో జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌లు కనపడి అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తారు. ఆ సాంగ్‌ రైట్స్‌ని చైనా నుండి తీసుకోవడం జరిగింది. ఆ సాంగ్‌ ఆడియన్స్‌కి తప్పకుండా నచ్చుతుంది.

హీరోయిన్‌ గురించి చెప్పండి?
– ఈసినిమాలో వైభవీజోషీ హీరోయిన్‌గా నటిచింది. ఆమెది పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్‌. అబ్బాయిల మ్యానరిజమ్‌ ఎక్కువ ఉంటుంది. ఆమెను నేను ఒక బాబా గెటప్‌లో వచ్చి మార్చే సీన్లు కూడా హిలేరియస్‌గా ఉంటాయి. ఆమెకు కూడా ఈ సినిమా మంచిపేరు తేవాలని కోరుకుంటున్నాను.

సినిమా బిజినెస్‌ ఎలా ఉంది?
– చాలా బాగుంది. ఈ సినిమా టీజర్‌ చూసి బ్రహ్మయ్య మా ప్రొడ్యూసర్స్‌ని నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డిని కాంటాక్ట్‌ అయ్యారు. అలాగే సినిమా చూసి సింగల్‌ పేమెంట్‌తో ఈ సినిమా రైట్స్‌ తీసుకున్నారు. ఆయన చాలా పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన అనుభవం ఉంది. ఆయన మా సినిమా రైట్స్‌ తీసుకోవడం చాలా హ్యాపీ. ఆయనకు ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది.

హీరోగా కమెడియన్‌ గా మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌?
– నేను ప్రస్తుతం కమెడియన్‌గా సందీప్‌కిషన్‌ సినిమా చేస్తున్నాను. హీరోగా ఒక స్క్రిప్ట్‌ రెడీ అయ్యింది. దానికి సప్తగిరి ‘దయ్యం పట్టింది’ అనే టైటిల్‌తో రెండు పార్ట్‌లుగా తీద్దాం అనుకుంటున్నాను. డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు స్టార్‌ కమెడియన్‌ సప్తగిరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here