ఈనెల 28న విడుదలవుతున్న ‘బ్రోచేవారెవరురా’

0
83

శ్రీ విష్ణు, నివేత థామస్, నివేత పేతురేజ్, సత్య దేవ్,  రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా బ్రోచేవారెవరురా. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. క్రియేటివ్ నెరేష‌న్‌ను, ఆర్టిస్టిక్ అంశాల‌కు జ‌నాలు ఫిదా అవుతున్నారు. స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ స‌పోర్టింగ్ రోల్స్ చేశారు. వివేక్ సాగ‌ర్ స్వ‌రాలందించారు. ఒక మంచి కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమా తీస్తే ఆదరిస్తారని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతోంది.

మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కుమార్ మ‌న్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి చ‌ల‌న‌మే చిత్ర‌ము చిత్ర‌మే చ‌ల‌న‌ము అనేది ఉప శీర్షిక. కాగా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు కాసేపటి క్రితం చిత్ర యూనిట్ ఒక అధికారిక పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మ‌న్యం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై విజ‌య్ కుమార్ మ‌న్యం నిర్మిస్తున్నారు.`బ్రోచేవారెవ‌రురా` ట్రైల‌ర్, ఆడియో విడుద‌ల గురించి త్వ‌ర‌లోనే నిర్మాత ప్ర‌క‌టించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here