గేమ్‌ ఓవర్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగే సైకలాజికల్‌ థ్రిల్లర్‌ – హీరోయిన్‌ తాప్సీ

0
131

ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ సినిమాలను ఎంచుకుంటూ హీరోయిన్‌గా తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నారు హీరోయిన్‌ తాప్సీ.రీసెంట్‌గా వైనాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానేర్స్‌పై అశ్విన్‌ శరవణన్‌(మయూరి ఫేమ్‌) దర్శకత్వంలో ఎస్‌. శశికాంత్‌ నిర్మించిన చిత్రం ‘గేమ్‌ ఓవర్‌’. తమిళ్‌, తెలుగు భాషల్లో సైకలాజికల్‌థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాప్సీ ఇంటర్వ్యూ.

చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నారు?
– హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ తెలుగులో మాత్రం ఏడాదికో సినిమా చేస్తున్నాను. అయితే తమిళ్‌లో చాలా గ్యాప్‌ వచ్చింది. ‘కాంచన 2’ తర్వాత అక్కడ మళ్ళీ సినిమా చేయలేదు. కోలీవుడ్‌కి దూరమవుతున్నా అనుకుంటున్నా సమయంలో అశ్విన్‌ శరవణన్‌ ఈ కథ చెప్పాడు. కథ వినగానే ఇంప్రెస్‌ అయ్యాను. అతను డైరెక్ట్‌ చేసిన ‘మాయ’ సినిమాలో కొన్ని సీన్స్‌ చూసాను. స్టఫ్‌ ఉన్న డైరెక్టర్‌ అనిపించింది అందుకే వెంటనే ఒకే చెప్పేసాను. ఆ తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో కూడా బైలింగ్వెల్‌ చేద్దామని ఫిక్స్‌ అయ్యాం.

గేమ్‌ ఓవర్‌ కాన్సెప్ట్‌ ఏంటి?
– ఇండియన్‌ సినిమాలో ఇదే ఫస్ట్‌ టైం. ఇప్పటి వరకూ నాకు తెలిసి ఇలాంటి కథ తెరకెక్కలేదు. అందుకే కథ విన్న వెంటనే ఏ భాషలో అయినా పరవాలేదు ఈ సినిమా చేయాలి అని డిసైడ్‌ అయ్యాను. హోం ఇన్వజన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్‌ థ్రిల్లర్‌.

మిగతా థ్రిల్లర్స్‌కి గేమ్‌ ఓవర్‌కి తేడా ఏంటి?
– ఈ సినిమాలో కథ, కథనం చాలా కొత్తగా ఉంటాయి. నిజానికి సినిమాకు అవే మెయిన్‌ హైలైట్‌. నా క్యారెక్టర్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. కానీ స్టోరీ, స్క్రీన్‌ ప్లే నా క్యారెక్టర్‌ని డామినేట్‌ చేస్తాయి. అందుకే ఈ సినిమా కాన్సెప్ట్‌ పరంగా టాప్‌లో ఉంటుంది.

https://industryhit.com/t/taapsee-pannu-pics-2/

ఈ సినిమా హిందీలో రిలీజ్‌ అవుతుంది కదా?
– ఈ సినిమాను కేవలం తమిళ్‌, తెలుగులో మాత్రమే తెరకెక్కించాం. హిందీలో డబ్బింగ్‌ సినిమాగా విడుదలవుతోంది. అనురాగ్‌ కశ్యప్‌ ఈ సినిమా చూసి హిందీలో డబ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఇది భాషతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్‌ అయ్యే కాన్సెప్ట్‌. అందుకే ఈ సినిమాను ప్యాన్‌ ఇండియా అంతటా రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం.

ఈ సినిమాలో మీకు బాగా కష్టం అనిపించిన సీన్‌ ఏది?
– సినిమాలో నాకు యాక్సిడెంట్‌ జరుగుతుంది. అది ఎలా జరిగిందనేది సినిమా చూస్తే తెలుస్తోంది. అందువల్లే దాదాపు అరవై శాతం సినిమాలో నేను వీల్‌చైర్‌లో కూర్చొనే ఉంటాను. నా కెరీర్‌లో ఫస్ట్‌ టైం ఇలా వీల్‌ చైర్‌లో కూర్చోవడం. ఇప్పటి వరకూ నాకెలాంటి ఫ్యాక్చర్‌ జరగలేదు. కానీ సినిమా కోసం వీల్‌ చైర్‌ తప్పలేదు. నిజానికి కాళ్ళు కదపకుండా చైర్‌లో కూర్చొని నటించడం చాలా కష్టమనిపించింది.

షూటింగ్‌ ఎన్ని రోజుల్లో కంప్లిట్‌ చేశారు?
– సౌత్‌లో జెనరల్‌గా షూటింగ్‌కి ఒక టైం ఉంటుంది. ఆ టైమింగ్‌తో చూసుకుంటే ఈ సినిమా కోసం రోజుకి ఒకటిన్నర షిఫ్ట్‌ వర్క్‌ చేసాం. అంటే దాదాపు పన్నెండు గంటల నుండి పద్నాలుగు గంటలు వర్క్‌ చేసాం. యూనిట్‌ అందరూ చాలా కష్టపడ్డారు. 25 రోజుల పాటు వీల్‌చైర్‌లో షూట్‌ చేసాం. 37 రోజుల్లో టోటల్‌ షూట్‌ కంప్లీట్‌ చేశాం.

మూడు భాషల్లో సినిమాలు చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తోంది?
– నేను చాలా లక్కీ. మూడు భాషల్లో సినిమాల్లో సినిమాలు చేస్తూ కెరీర్‌ని కొనసాగిస్తున్నాను. మూడు భాషల ప్రేక్షకులు నన్ను నటిగా గుర్తుపడతారు. అందుకే ఆ విషయంలో నేను చాలా లక్కీగాఫీలవుతుంటాను.ఇప్పటి వరకూ నేను నటించిన సినిమా పోస్టర్‌లో నా పేరు పడలేదు. నేను పని చేసిన హిందీ సినిమాలకు కూడా పోస్టర్‌లో నా పేరుండదు. కానీ ఫస్ట్‌ టైం ‘గేమ్‌ ఓవర్‌’ తమిళ్‌ పోస్టర్‌పై టాప్సీ ఇన్‌ అండ్‌ యాస్‌ అని పడింది. పోస్టర్‌ మీద నా పేరు చూసి నా రెస్పాన్సిబిలిటీ పెరిగిందనిపించింది.

చాలా క్యాలూక్క్యులేటెడ్‌గా కనిపిస్తున్నారు కదా నిర్మాణ రంగంలోకి వచ్చే ఆలోచన ఉందా?
– నిర్మాతగా మారాలనే ఆలోచన ఉంది. కాకపోతే నిర్మాణం అనేది చాలా రిస్క్‌తో కూడినది. అందుకే పార్ట్నర్‌షిప్‌లో సినిమాలు నిర్మించాలని ప్లాన్‌ చేస్తున్నా. ప్రస్తుతం పార్ట్నర్‌ కోసం చూస్తున్నాను. మంచి కథ దొరికి టీమ్‌ సెట్‌ అయితే నిర్మాతగా సినిమా చేస్తాను. ప్రస్తుతానికి నా దష్టి నటన మీదే ఉంది.

మీ నెక్స్ట్‌ సినిమాలు ?
– ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా సైన్‌ చేశాను. అలాగే తెలుగులో కూడా ఒక ఆఫర్‌ ఉంది. హిందీలో ప్రస్తుతం రెండు సినిమాలు జరుగుతున్నాయి. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరోయిన్‌ తాప్సీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here