జూన్ 13న కింగ్ నాగార్జున `మ‌న్మ‌థుడు 2` టీజ‌ర్‌

0
58

కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రం మన్మధుడుకి సీక్వెల్ గా రానున్నమ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ ప‌తాకాల‌పై రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లోను అలానే అక్కినేని అభిమానుల్లోనూ మంచి అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని ఈనెల 13వ తేదీన మధ్యాహం 1 గంటకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర బృదం ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది.కింగ్ నాగార్జున హీరోగా ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఒక షెడ్యూల్ మిన‌హా సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు కూడా ప్లాన్ చేస్తున్నారు.

నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు నాగార్జున‌- ర‌కుల్‌, నాగార్జున‌- కీర్తిసురేష్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. అన్నపూర్ణ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడ ప్రత్యేక పాత్రల్లో నటిస్తుండగా, సీనియర్ నటి లక్ష్మి, నాజర్, వెన్నెల కిశోర్, రావు రమేష్, దేవదర్శిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  మ‌న్మ‌థుడు ఇన్‌స్పిరేష‌న్‌తో, రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here