తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప నటులు ఎస్వీయార్ : మెగాస్టార్ చిరంజీవి

0
650

అప్పటి తెలుగు సినిమా అగ్రనటులైన ఎన్టీఆర్, ఎఎన్నార్ గార్లకు ధీటుగా నటించి నటనలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న నటులు దివంగత ఎస్వీ రంగారావు గారు. ఆయనకు టాలీవుడ్ లో ఎందరో అభిమానులున్నారు. ఇక అయన జీవితంపై రచయిత సంజయ్ కిశోర్ రాసిన ‘మహానటుడు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నటులు రావికొండలరావు, రోజారమణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీతో పాటు, కిమ్స్‌ హాస్పిటల్స్‌ అధినేత బొల్లినేని కృష్ణయ్య, మండలి బుద్ధ ప్రసాద్, ఎస్పీ రంగనాద్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

https://industryhit.com/t/sv-rangaraos-mahanatudu-book-launch-pics/

అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, చిన్నప్పటినుండి తాను ఎస్వీఆర్ గారు నటించిన సినిమాలు చూస్తూనే పెరిగానని, అలానే అయన నటించిన జగజ్జంత్రీలు, జగత్ కిలాడీలు సినిమాల్లో తన తండ్రి వెంకట్ రావు గారు చిన్న పాత్రలో నటించారని అన్నారు. అయితే ఎస్వీఆర్ గారి గొప్పతనాన్ని గురించి తన తండ్రి చెప్తున్నప్పుడు తనకు కూడా నటుడు కావాలనే ఆశ కలిగిందని అన్నారు చిరంజీవి. తెలుగు జాతి గర్వించదగా గొప్పనటులైన ఆయనని జీవితంలో ఒక్కసారైనా కలవాలన్న కోరిక మాత్రం తీరలేదని, అయితే ప్రస్తుతం అయన జీవితంపై రాయబడ్డ ఈ పుస్త ఆవిష్కరణతో తన కోరిక తీరిందని చిరంజీవి అన్నారు. ఇక వేడుకకు విచ్చేసిన పలువురు ఎస్వీఆర్ గారి సినిమాలు నటన, మరియు అయన గొప్పతనం గురించి వ్యాఖ్యానించారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here