యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం నటిస్తున్న కొత్త సినిమాకు చాణక్య అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించారు . భారీ స్పై థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన స్టన్నింగ్ బ్యూటీ మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జరీనా ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మంచి యాక్షన్ మరియు ఎంటర్టైన్మెంట్ కలయికగా ఈ చిత్రం రూపొందుతోందని, రేపు విడుదల తరువాత ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ అంటోంది. సినిమాకు మాటలు అబ్బూరి రవి అందిస్తుండగా, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్, రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందిస్తుస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 50 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది.


