హీరోగా నటించిన తొలిసినిమా ‘పెళ్లి చూపులు’ తో మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ, ఆ తరువాత నటించిన అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ఇక ఆపై అయన నటించిన గీతగోవిందం కూడా హిట్ అవడంతో విజయ్, యూత్ మరియు లేడీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించి మంచి స్టార్ స్టేటస్ సంపాదించారు. ఇక ప్రస్తుతం అయన రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నారు. అయితే వాటిలో ఒకటి, భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న డియర్ కామ్రేడ్. టాలీవుడ్ లోని అగ్రనిర్మాణ సంస్థ, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
ఇక ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు పాటలను విడుదల చేసింది చిత్ర బృందం. అయితే వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో, సినిమాపై అంచనాలు కూడా బాగా పెరిగాయి. కాగా ఈ సినిమాలో మరొక్కసారి గీతగోవిందం భామ రష్మిక, విజయ్ తో జోడి కడుతుండగా శృతి రామచంద్రన్ మరొక ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక నిన్న ఈ సినిమా విడుదలకు మరొక 50 రోజులే మిగిలి ఉంది అంటూ చిత్ర నిర్మాతలు తమ సామజిక మాధ్యమాల్లో ఒక ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే ఇప్పటినుండి తమ సినిమాకు సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించి అటు ప్రేక్షకులను ఇటు విజయ్ అభిమానులను బాగా ఉత్సాహపరచాలని ప్లాన్ చేస్తున్నారట. కాగా ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, అన్ని కార్యక్రమాలు ముగించుకుని జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది….!!


