టాలెంటెడ్‌ డైరెక్టర్‌ తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత అనిల్‌ సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘సీత’. యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ చిత్రం మే 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘సీత’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌ రావినారాయణ రెడ్డ్డి ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో….

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌ మాట్లాడుతూ – ” ట్రైలర్‌లో చూపించింది జస్ట్‌ వన్‌ పర్సెంట్‌ మాత్రమే. థియేటర్‌లో మిగతా పెర్‌ఫార్మెన్స్‌లు చూస్తారు. నాకు చాలా నచ్చిన స్టోరీ ఇది. ఎక్సయిటింగ్‌గా వెయిట్‌ చేస్తున్నాను. తేజగారి దగ్గర ఈ స్టోరీ ఎప్పుడో విన్నాను. ఇప్పుడు సినిమాగా మీ ముందుకు వస్తుంది. అలానే ఈ క్యారెక్టర్స్‌లో చేసిన వారు లక్కీ. ఈ అవకాశం ఇచ్చిన తేజగారికి, అనిల్‌ సుంకర గారికి, కిషోర్‌గారికి థాంక్స్‌” అన్నారు.

నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ – ”తేజగారు ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. ఎలాంటి హీరో కావాలి అని అడిగాను. అందుకు తేజగారు బెల్లంకొండ శ్రీనివాస్‌ ఐతే బాగుంటుంది అన్నారు. వెంటనే పర్ఫెక్ట్‌ అని వెంటనే సెలెక్ట్‌ చేయడం జరిగింది. తేజగారు వన్‌ ఆఫ్‌ బెస్ట్‌ డైరెక్టర్‌. అంత సీనియర్‌ డైరెక్టర్‌ అయినా మా ఆఫీస్‌కి వచ్చే ఫస్ట్‌ పర్సన్‌ మరియు ఇంటికి వెళ్లే లాస్ట్‌ పర్సన్‌. అంత సిన్సియర్‌గా ఉంటాడు. ఆయన డెడికేషన్‌, ఎఫర్ట్‌, లవ్‌ ఫర్‌ ది మూవీస్‌ అంత గొప్పవి. ఆయన ది బెస్ట్‌ మూవీ లవర్‌ కనుకనే కొత్త కొత్త ఆర్టిస్టులను, టెక్నిషియన్స్‌ను ఆయనే పరిచయం చేస్తారు. ఒక కొత్త ఆర్టిస్ట్‌ని పరిచయం చేయాలంటే గట్స్‌ ఉండాలి… ఇక హీరో సాయి చాలా మాకో క్యారెక్టర్స్‌ చేశారు. అయితే తేజగారు మాకు రెండు స్టోరీస్‌ చెప్పారు. మా అద ష్టవశాత్తు మా ఇద్దరికి ఒకే కథ నచ్చింది. అదే ‘సీత’. ఒక జెన్యూన్‌ పెర్ఫామెన్స్‌కి స్కోప్‌ ఉండే క్యారెక్టర్‌. ఈ సినిమాలో సాయి ఇప్పటివరకూ చేసిన అన్ని పెర్‌ఫార్మెన్స్‌లు కన్నా ది బెస్ట్‌ చేశారు. ఆయన పెట్టిన ఎఫర్ట్‌, తేజగారి మేకింగ్‌ ఈ సినిమాను నెక్స్‌ట్‌ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఈ సినిమా తరువాత కాజల్‌ని చూసి లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌కి పూర్తి న్యాయం చేయగలదు అని కచ్చితంగా నమ్ముతారు. తేజగారు ఆమెలోని కొత్త ఆర్టిస్ట్‌ని బయటకు తీశారు. మన్నారా కూడా మంచి పెరఫామెన్స్‌ ఇచ్చింది. అలాగే సోనూసూద్‌ క్యారెక్టర్‌కి ఆయన మాత్రమే జస్టిస్‌ చేయగలడు అనిపించింది. లక్ష్మి భూపాలగారు రాసిన డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. అనూప్‌తో నా రెండో సినిమా ఎక్కడా స్ట్రెస్‌ ఫీల్‌ అవ్వడు. మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. మే 24 ప్రతి ఒక్కరూ సినిమా చూడండి” అన్నారు.

Mannara Chopra – Pics

టాలెంటెడ్‌ డైరెక్టర్‌ తేజ మాట్లాడుతూ – ”నాకు మాట్లాడడం ఎక్కువ రాదు. సినిమా జడ్జిమెంట్‌ కూడా అంతగా తెలీదు. రేపు సినిమా చూసి మీరే చెప్పాలి. ఈ సినిమాలో సాయిని రెగ్యులర్‌ కమర్షియల్‌ స్టైల్‌లో కాకుండా చాలా కొత్తగా చూపించాను. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. సోను సూద్‌ నేను అనుకున్నదాని కన్నా చాలా బాగా చేశారు. ఇక కాజల్‌తో నా రెండో సినిమా. అనూప్‌ సంగీతం బాగుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇంకా బాగుంది. మన్నారా మంచి పెరఫార్మెర్‌. ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. వీళ్ళందరికీ నేను గ్రేడింగ్‌ ఇవ్వగలను.. కానీ నాకు మాత్రం ఆడియన్స్‌ మాత్రమే గ్రేడింగ్‌ ఇవ్వగలరు. నన్ను తిట్టినా, పొగిడినా అది నేను సినిమాలో పెట్టేస్తాను. ఎందుకంటే నాకు సినిమా తప్ప వేరొకటి తెలీదు. ఆడియన్స్‌ లేకపోతే నేను లేను. మీరందరు బాగుండాలి” అన్నారు.

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ – ”నేను మొదటి సారి ఈ సినిమా కోసం యాక్షన్‌ ఎపిసోడ్‌ చేశాను. మా టీం అందరి సపోర్ట్‌ లేకపోతే నేను అంత బాగా చేసే దాన్ని కాకపోవచ్చు. ఇదొక బ్రిలియంట్‌ జర్నీ. సోనూసూద్‌ వండర్‌ఫుల్‌ కోస్టార్‌. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. తేజగారు నా గురు, నా మెంటర్‌, గైడ్‌. ఆయన లేకపోతే నేను ఈ స్టేజీపై ఉండేదాన్ని కాదు. తేజగారి స్కూల్లోనే నేను అంతా నేర్చుకున్నాను. ‘సీత’ సినిమాతో పిహెచ్‌డి చేసే అవకాశం వచ్చింది. నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు జీవితాంతం రుణ పడి ఉంటాను.” అన్నారు.

Kajal Agarwal – Pics

నటుడు సోనూ సూద్‌ మాట్లాడుతూ – ”ఇటీవల ఒక ఫంక్షన్‌లో నన్ను ఒక ప్రశ్న అడిగారు. మీరు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు కదా..! మీ ఫేవరెట్‌ లాంగ్వేజ్‌ ఏంటి? అని అడిగారు. నేను వెంటనే తెలుగు అని చెప్పా. నేను హిందీవాడినే అయినా నాకంటూ ఒక ప్లాట్‌ఫామ్‌ ఇచ్చింది తెలుగు లాంగ్వేజే. తెలుగు ఇండస్ట్రీ నా ఫేవరెట్‌ ఇండస్ట్రీ. ఇక్కడున్న టెక్నీషియన్స్‌ ఎంతో ప్రేమగా చూస్తారు. నా డేట్స్‌ ఖాళీ లేకపోయినా నా కోసం నెలరోజులు వెయిట్‌ చేసి, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన తేజగారికి ధన్యవాదాలు.” అన్నారు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ – ”సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరి ప్రేమ, ఆదరణ పొందడానికి నేను జీవితాంతం ఇలాగే కష్టపడుతూ ఉంటా. సినిమానే నాకు ప్రాణం. సినిమాకోసం నేను ఏమైనా చేస్తా. తేజగారిలాంటి ఫ్యాషనేట్‌ ఫిల్మ్‌ మేకర్‌ను నేను లైఫ్‌లో ఇప్పటివరకు కలవలేదు. ఇలాంటి ప్యాషన్‌ ఉన్న డైరెక్టర్లను అరుదుగా చూస్తాం. నా ఆరో సినిమాకే ఇలాంటి దర్శకుడితో పనిచేస్తానని అనుకోలేదు. ‘సీత’ సినిమాలో నేను చేసిన రఘురామ్‌ అనే పాత్ర ఛాలెంజింగ్‌ రోల్‌. సినిమా చూశాక నా క్యారెక్టర్‌కు తప్పకుండా సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ సినిమా నాకు ఒక యాక్టర్‌గా మంచి రెస్పెక్ట్‌ తీసుకొస్తుందని బలంగా నమ్ముతున్నాను. హీరో అంటే ఫస్ట్‌ కనిపించాలి. ఫస్ట్‌ ఇంట్రడ్యూస్‌ అయ్యి ఫైట్లు చేసేయాలి అనుకునేవాణ్ని. కానీ తేజగారితో పనిచేశాక అది తప్పని తెలుసుకున్నాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే మహిళలకు పురుషుల కంటే మేధస్సు ఎక్కువ అని చెబుతుంటాం. కానీ ప్రాక్టికల్‌గా చూపించలేదు. అందుకే అలాంటి కథతో సీత అనే సినిమా చేశాం. టైటిల్‌ రోల్‌ చేసిన కాజల్‌ చాలా కష్టపడ్డారు. సోనూసూద్‌గారు ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. మన్నారా చోప్రాతో పాటు ఇతర నటీనటులు కూడా చక్కగా నటించారు. మా ప్రొడ్యూసర్‌ అనిల్‌గారు మా అందరినీ మేనేజ్‌ చేసి చాలా బాగా చూసుకున్నారు. మా నాన్నగారి బ్యానర్‌ తర్వాత ఇంత పెద్ద బ్యానర్‌లో పనిచేయడం ఇదే తొలిసారి. అనూప్‌ రుబెన్స్‌గారు ఆర్‌ఆర్‌తో చాలా బాగా ఆకట్టుకున్నారు. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులకు ఆ విషయం తెలుస్తుంది.” అన్నారు.

‘Sita’ Pre-Release Event (Bellamkonda Srinivas, Kajal, Mannara, Sonu Sood) – Pics