కింగ్‌  నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రీసెంట్‌గా నెల‌పాటు పోర్చుగ‌ల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ‘మ‌న్మ‌థుడు’ ఇన్‌స్పిరేష‌న్‌తో మ‌న్మ‌థుడు 2 చిత్రాన్ని లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందిస్తున్నారు. నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్ స‌హా న‌టీన‌టులంద‌రూ పాల్గొనగా ఈ సినిమాకు సంబంధించి పోర్చుల్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ రీసెంట్‌గా పూర్తి చేసింది. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్‌ను హైద‌రాబాద్‌లో చిత్రీక‌రించ‌నున్నారు.

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ ఫ‌న్ రైడ‌ర్ తెర‌కెక్కుతోంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘Manmadhudu 2’ (Akkineni Nagarjuna, Rakul Preet) – Stills

న‌టీన‌టులు:
కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌, నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌ ,నిర్మాణ సంస్థ‌లు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌, మ్యూజిక్: చైత‌న్య భ‌రద్వాజ్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఎం.సుకుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌: ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌, స్క్రీన్‌ప్లే: రాహుల్ ర‌వీంద్ర‌న్, స‌త్యానంద్‌, ఎడిట‌ర్స్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌, బి.నాగేశ్వ‌ర రెడ్డి, డైలాగ్స్‌: కిట్టు విస్సా ప్ర‌గ‌డ‌, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, కాస్ట్యూమ్స్‌: అనిరుధ్ సింగ్‌, దీపికా ల‌ల్వాని.