‘మహర్షి’ వరకు వంశీ పైడిపల్లి ప్రస్థానం

0
459

మొక్కగా మొదలైంది ప్రయాణం.. ఇప్పుడు మహావృక్షంగా ఎదిగి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ ల్యాండ్ మార్క్ ఫిలిం (25) ‘మహర్షి’ మూవీ ను డైరెక్ట్ చేశారు.. ఆయన ఎవరో కాదు వంశీ పైడిపల్లి. ‘మహర్షి’ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న వేళ దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రస్థానం తెలుసుకుందాం..

*వంశీది అడవుల జిల్లా..బాల్యం, విద్యాభ్యాసం ఇక్కడే..
వంశి పైడిపల్లి.. ఈయన స్వస్థలం ప్రస్తుత నిర్మల్ జిల్లా ఖానాపూర్. ఖానాపూర్ లోనే వంశీ పుట్టాడు. పూర్వపు ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అంతటి మారుమూల పల్లె నుంచి అగ్ర సినిమా దర్శకుడిగా ఎదగడం ఆయన పట్టుదలకు నిదర్శనం. వంశీ తండ్రికి ఓ థియేటర్ ఉంది. అందులో సినిమాలు చూసి ఆ ఆసక్తే వంశీని సినిమా రంగంవైపు అడుగులు వేయించింది. వంశీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇక ఇంటర్ మీడియెట్ ను లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ విద్యనభ్యసించాడు.ఆ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ చేసి అనంతరం ఎంసీఏను భద్రుకా కాలేజీ లో పూర్తి చేశాడు. అనంతరం కొద్ది కాలం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేశాడు. కానీ ఆ తర్వాత సినిమాలపై ఉన్న ప్రేమ, ఫ్యాషన్ తో ఇటు వైపు మల్లాడు.

*ఈశ్వర్ సినిమాతో సినీ ప్రయాణం..
సినిమాలపై ప్రేమతో సాఫ్ట్ వేర్ జాబ్ ను వదిలేసిన వంశీ పైడిపల్లి 2002లో ప్రభాస్ తొలి చిత్రం ‘ఈశ్వర్’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత వర్షం, మాస్, భద్ర సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా చేశాడు. ఆ తర్వాత తొలిసారి డైరెక్టర్ గా మారి ప్రభాస్ నటించిన ‘మున్నా’ సినిమాతో 2007లో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఆ తర్వాత అంచలంచెలుగా 2010లో బృందావనం సినిమాను ఎన్టీఆర్ హీరోగా డైరెక్ట్ చేశాడు.ఇక 2013లో చరణ్, బన్నీ కలిసి నటించిన ‘ఎవడు’ మూవీని తీశాడు. ఆ తర్వాత 2016లో తీసిన ‘ఊపిరి’మూవీ వంశీకి ఊపిరిపోసింది. ఈ సినిమాతో ఏకంగా అగ్రహీరోలను ఆకర్షించి ఏకంగా మహేష్ ను మెప్పించి ఒప్పించి ‘మహర్షి’ని డైరెక్ట్ చేశాడు. ఇప్పుడీ మూవీ మే 9న రిలీజ్ అవుతోంది.

ఇలా మున్నాతో మొదలైన వంశీ ప్రయాణంలో అన్ని సినిమాలు హిట్సే.. బృందావనం, , ఎవడు, ఊపిరి, ఇప్పుడు మహర్షి. అంచలంచెలుగా ఎదిగిన వంశీ టాలీవుడ్ లో మహర్షి తర్వాత అగ్ర దర్శకుల్లో ఒకడిగా మిగిలిపోవడం ఖాయమంటున్నారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా ఎదిగిన వంశీ జర్నీ స్ఫూర్తిదాయకం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here