ఫోటో స్టొరీ : నలభైలలో ఇరవై అంటే ఇదే!

0
431

సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరు ఈ జెనరేషన్ వారికి పరిచయం ఉండకపోవచ్చు కానీ మునుపటి జనరేషన్ వారికి పరిచయమే. ఇక పాత సినిమాలు చూసేవారికైతే ఖచ్చితంగా శిల్పా పేరు తెలిసే ఉంటుంది. అప్పట్లో పొడవు కాళ్ళ సుందరిగా పేరు తెచ్చుకున్న శిల్పా శెట్టి ఎన్నో సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాల్లో నటించింది. తెలుగు సినిమాల్లో కూడా నటించింది ఈ భామ. హీరోయిన్ గా కెరీర్ మందగించిన తర్వాత బ్రిటన్ లో బిగ్ బాస్ షో లో పాల్గొనడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఇక శిల్పా శెట్టి యోగా వీడియోలు ఎంత పాపులర్ అనేది యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది.

అయినా ఇప్పుడు ఈ సీనియర్ బ్యూటీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే రీజన్ ఉంది. ఈ భామ వయసు ఇప్పుడు 43 ఏళ్ళు ఈ భామకు వియాన్ అనే ఆరేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ ఫిట్నెస్ ను.. గ్లామర్ ను మెయింటెయిన్ చేసేందుకు వయసు కానీ మరొకటి కానీ అడ్డంకి కాదని నిరూపిస్తోంది ఈ ప్రౌఢ భామ. రీసెంట్ గా అబూదాబిలో ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి చక్కగా తయారై వచ్చింది శిల్పా. చాకొలేట్ కలర్ చుక్కలు ఉండే క్రీమ్ కలర్ డిజైనర్ డ్రెస్ వేసుకున్న శిల్పా ఎంతో స్టైల్ గా ఫోటోకు పోజిచ్చింది. సహజంగా చాలామంది సీనియర్ హీరోయిన్లు అటెన్షన్ కోసం గ్లామర్ ప్రదర్శనకు దిగుతారు. కానీ శిల్పా మాత్రం ఎంతో హుందాగా ఉండే డ్రస్ లో పోజిచ్చి ఇలా కూడా ఆకర్షణీయంగా కనిపించవచ్చని నిరూపించింది. ఈ ఫోటోలో మెట్లుమెట్లుగా ఉండే డ్రెస్ బాటమ్ శిల్పా ఆకర్షణను మరింతగా పెంచింది.

పోనీ టెయిల్.. వేలాడే చెవి రింగులు.. ఎడమ చేతికి మాత్రమే మ్యాచింగ్ కలర్ లో గాజులు ధరించింది. ఒడ్డాణం లాగా అనిపించే ఒకరకం బెల్టు.. వెరైటీగా అనిపించేలా వేసుకున్న చున్నీ కూడా ఆమె స్టైల్ ను పెంచాయి. అసలు ఈ ఫోటో చూసి ఆమెకు 43 ఏళ్ళ వయసు ఉందంటే ఎవరూ నమ్మలేరు. అంత ఫిట్ గా.. స్లిమ్ గా ఉంది. 43 ఏళ్ళ వయసులో 23 ఏళ్ళ భామలా కనిపించడం అంటే మాటలు కాదు కదా.. దాని వెనక ఎంతో డిసిప్లిన్.. కఠిన శ్రమ ఉంటుంది. అసలే యోగా బ్యూటీ కాబట్టి ఎడాపెడా యోగా చేసి ఇలా అందాన్ని కాపాడుకుంటుందేమో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here