దుమ్ముదులుపుతున్న మహర్షి ట్రైలర్.. 5 మిలియన్స్ దిశగా..

0
521

అభిమానుల ఆశలు ఫలించేలా.. అందరి అంచనాలు అందుకునేలా.. ‘మహర్షి’ ప్రి రిలీజ్ వేడుక సందర్భంగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. భిన్న పార్వ్యాలు.. స్టూడెంట్ గా మొదలైన జీవితం.. జీవితంలో గెలవాలనే రిషి పంతం.. తల్లిదండ్రులతో విభేదించి బడా పారిశ్రామికవేత్తగా ఎదిగిన వైనం.. అక్కడ సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చివరికి నాగలి పట్టి వ్యవసాయం చేస్తున్న మహేష్.. ఇలా మహర్షి ఒక పూర్తి స్థాయి చిత్రంగా గెలవడం కోసం బతికే ఒక యువకుడి కలలు ట్రైలర్ లో ఆవిష్కృతమైంది.

మహర్షి ట్రైలర్ నిన్న రాత్రి విడుదలైంది. కేవలం 15 గంటల వ్యవధిలోనే దుమ్ముదులిపింది. ఇండస్ట్రీలో ఇంత తక్కువ టైంలో 40 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించిన ట్రైలర్ గా నిలిచింది. గంట గంటకు వ్యూస్ సంఖ్య పెరుగుతోంది. మరో రెండు మూడు గంటల్లోనే 5 మిలియన్ల వ్యూస్ చేరుకునే అవకాశం ఉంది. తక్కువ వ్యవధిలో 1 మిలియన్ వ్యూస్ సాధించడమే ఒక రికార్డ్. కానీ మహేష్ సినిమా 15 గంటల్లోనే 4 మిలియన్ల వ్యూస్ దాటి పోయి యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఇది అతిపెద్ద రికార్డ్ గా చెబుతున్నారు. ఇప్పటికీ యూట్యూబ్ లో టాప్ 1లో ట్రెండ్ అవుతూ సంచలనాలను మహర్షి ట్రైలర్ సృష్టిస్తోంది.

ఇక మహర్షి ప్రి రీలజ్ ఈవెంట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన ఒక రహస్యంపై కూడా ఇప్పుడు అభిమానుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన 6 పాటలే కాకుండా.. మరో సంచలన పాట మహర్షిలో ఉందని.. అది కావాలనే తాము రిలీజ్ చేయలేదని.. అది సినిమాలో చూడాలని.. చూసిన ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్  వస్తాయని అసలు రహస్యాన్ని వంశీ చెప్పాడు. ఈ పాట ఏంటి? ఎక్కడ వస్తుంది? ఎందుకంత స్పెషల్. ఎందుకు విడుదల చేయలేదని.. ఇప్పుడు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. మొత్తం మహర్షి ప్రి రిలీజ్ వేడుక భారీ అంచనాలను పెంచేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here