ఫొటోస్టోరీ: జలపాతం అంచున చందమామతో అల్లుడు శీను

0
605

చుట్టూ అడవి.. పచ్చని చెట్లు.. ప్రకృతి పోత పోసినట్టు ఉంది. హోయలు ఒలుకుతూ జలపాతం పరవళ్లు తొక్కుతోంది.. చల్లటి నీటి చప్పుడు జలజలా రాలుతూ శబ్ధం చేస్తోంది.. పక్కనే చందమామ.. కందిపోయే చక్కనమ్మ చెంతనుండగా.. అల్లుడు శీను ఆటపట్టిస్తున్నాడు. నేనున్నానంటూ ఆ నీటి తీరువాలో నడిపిస్తున్నాడు. ఈ సుందర దృశ్యం ‘సీత’ సినిమా షూటింగ్ సాక్షిగా ఆవిష్కృతమైంది.

ఒక చక్కటి జలపాతం ఉదృతంగా ప్రవహిస్తోంది. పక్కనే కాజల్ లాంటి అందమైన అమ్మాయి ఉంటే ఏ హీరో ఆగుతాడు చెప్పండి.. మన బెల్లం కొండ శ్రీనివాస్ కూడా ఆగలేదు.. కాజల్ వద్దు వద్దు అంటూ భయపడుతున్నా.. బెల్లంకొండ రియల్ హీరోలా చేయిపట్టి జలపాతాన్ని పరిచయం చేస్తున్నాడు. నేను ఉన్నా నువ్వు రా అంటూ ముందుకు తీసుకెళ్లాడు. జలపాతం అందాలకు చందమామ కాజల్ కూడా ఫిదా అయ్యింది. లోలోపల భయం వెంటాడుతున్నా ఆ అందాలను ఆస్వాదించింది. ఈ సుందర దృశ్యం ‘సీతా’ సినిమా షూటింగ్ సందర్భంగా చోటుచేసుకుంది.

సలసలా నిప్పులు కురిపిస్తున్న సూరీడు.. బయట అడుగు పెట్టలేని పరిస్థితి. అందుకే అందరూ హాలీడేస్ కు వెళ్తున్నారు. ‘సీతా’ సినిమా యూనిట్ మాత్రం వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ షూటింగ్ జరుపుతోంది. కాజల్ ప్రధాన పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో తేజ దర్శకత్వంలో తీస్తున్న ఈ మూవీ ఈ నెలలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్ లో జలపాతం పక్కన హీరో బెల్లంకొండ, హీరోయిన్ కాజల్ ఉనప్పుడు తీసిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలై వైరల్ గా మారింది.

కాజల్, బెల్లంకొండ ఫొటో ఇదే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here