మే నెలలో సినీ అభిమానులకు పండుగే..

0
440

మే నెల.. చిక్కటి ఎండలు కాసే నెల.. రోహిణీ కార్తెకు రోకల్లు కూడా పగులుతాయట.. ఆ రోహిణీ కార్తె వచ్చేది ఇదే మే నెలలో.. ఇప్పటికే ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు పైగా నమోదవుతోంది. మే చివరి వరకూ 50 డిగ్రీలు ఖాయం.. ఎండకు బయటకు వెళ్లలేని పరిస్థితి. అందరూ ఇంట్లోనే ఉంటున్నారు.

అయితే సుర్రమంటున్న సూరీడు వేడి ఒకవైపు.. అదిరిపోయే సినిమాలు మరో వైపు మే నెలలో సినీ అభిమానులను ఉర్రూతలూగించడానికి రెడీ అయ్యాయి. ఈ మే నెలలో ఎన్నో అద్భుతమైన సినిమాలు మన ముందుకు వస్తున్నాయి.

పెద్ద సినిమాల పరంగా చూస్తే.. మే నెలలో 9న మహర్షితో ముందుగా మహేష్ బాబు దూసుకొస్తున్నాడు. తెలుగు అగ్రహీరోల్లో ఒకడిగా ఉండడం… వేల సంఖ్యలో అభిమాన గణం ఉండడంతో ‘మహర్షి’ సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇక మే 3న చిన్న సినిమా నువ్వు తోపురా రిలీజ్ అవుతోంది. అల్లు శిరీష్ హీరో గా ‘ఏ బి సి డి’ మే 15 న రిలీజ్ అవుతుండగా. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో రెడీ అవుతున్న ‘సీత’ కూడా మే నాలుగవ వారంలో విడుదలకి సిద్ధం అవుతోంది.  మే నెలాఖరున సూర్య పొలిటికల్ థ్రిల్లర్ ‘ఎన్ జీ కె’ కూడా ప్రేక్షకుల ముందుకి రానుంది.  ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలని పెంచేసింది.

ఇవే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా మే నెలలో ఎన్నో హాలీవుడ్ , బాలీవుడ్ ప్రముఖ చిత్రాలు మన మందుకు వస్తున్నాయి. మే చివరి వారంలో అల్లాడిన్ పేరుతో డిస్నీ రూపొందించిన అద్భుత గ్రాఫిక్స్ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మే నెలలోనే గొప్ప గ్రాఫిక్స్ భారీ చిత్రం ‘గాడ్జిల్లా’ మూవీ కూడా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ దుమ్ము రేపుతోంది.

ఇక పికాచో అనే కార్టూన్ బేస్ డ్ చిత్రంతోపాటు బాలీవుడ్ లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ , హాస్టల్ అనే పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇలా మే నెల అంతా భారీ ప్రతిష్టాత్మక చిత్రాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. ఎండ వేడిలో అభిమానులను అలరించడానికి వస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here