నవ్వించడం.. భయపెట్టడం.. ఈ రెండు అంత ఈజీ కాదు.. దానివెనుక ఎంతో కసరత్తు, కృషి ఉంటే కానీ సాధ్యం కాదు.. కానీ హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ మాత్రం వరుసగా ప్రేక్షకులను భయపెడుతూ ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతున్నాడు.
తాజాగా తమిళంలో ఆయన తీసిన ముని3, తెలుగులో కాంచన3గా వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు,తమిళంతోపాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
కాంచన3 వందకోట్ల క్లబ్ లో చేరినట్టు తాజాగా చిత్రం యూనిట్ ప్రకటించింది. ఈమేరకు 100 కోట్ల + ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్టు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో ఆయనే హీరోగా తీసిన ఈ హర్రర్, సస్పెన్స్ దెయ్యం కథ ఆద్యంతం ఆకట్టుకుంది. కాంచన2 సినిమాకు కంట్యూనేషన్ గా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో దుమ్ము రేపుతోంది. ట్రస్ట్ పేరుతో సమాజానికి మంచి చేసే వ్యక్తిని మంత్రి చంపితే దెయ్యంగా మారి ఎలా పగతీర్చుకున్నాడన్నది కథ. ఇందులో హీరోగా.. దెయ్యం ఆవహించిన పాత్రలో లారెన్స్ విశ్వరూపమే చూపించాడు. ప్రేక్షకులను భయపెడుతూ థియేటర్లలో ఆదరాభిమానాలను పొందుతున్నాడు. ఇలా 100 కోట్ల క్లబ్ లో చేరిన లారెన్స్ మూవీకి పలువురి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.