నిఖిల్ ‘అర్జున్ సురవరం’వాయిదా.. కారణమిదే

0
505

కథ కోసం ఎంతో కసరత్తు.. దాదాపు సంవత్సరం పాటు షూటింగ్.. మంచి సినిమా ప్రేక్షకులకు అందించడానికి పడే తపన అంతా ఇంతా కాదు.. చివరికి సినిమా రిలీజ్ వేళ సంబరంగా ఉంటే అవాంతరాలు.. ఇలా సినిమా కష్టాలన్నీ ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్ కు వచ్చాయి. మే 1న రిలీజ్ కావాల్సిన తన సినిమా ‘అర్జున్ సురవరం’వాయిదా పడింది .

హీరో నిఖిల్ తన తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మే1న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ప్రమోషన్ కూడా మొదలుపెట్టాడు. ఇంతలోనే అనుకోని అవాంతరం. ఒక సంవత్సరం తర్వాత మంచి కథా కథనంతో కూడిన సినిమాతో మే1న వస్తున్న వేళ అనుకోని అవాంతరం ఎదురైంది..

ప్రపంచవ్యాప్తంగా ఈనెలాఖరులో అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా విడుదలవుతోంది. అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రానికి తోడు విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న చిత్రాల వల్ల కావాల్సినన్ని థియేటర్లు అందుబాటులో లేనందున, ముఖ్యంగా మల్టీప్లెక్స్ లు అన్నింటిలో అవెంజర్స్ ప్రదర్శిస్తున్నందు వల్ల చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ‘అర్జున్ సురవరం’ హక్కులు కొనుగోలు చేసిన ఏషియన్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు హీరో నిఖిల్, నిర్మాతలు కూడా అంగీకరించారని చెప్పారు. వారి సలహా మేరకు నిఖిల్ తన సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు.

ఇది నాకు బాధకరం అయినప్పటికీ డబ్బులు పెట్టి కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయాన్ని గౌరవిస్తూ వారిచ్చే మరో గ్రాండ్ రిలీజ్ డేట్ కోసం తాను ఎదురుచూస్తున్నానని తాజాగా నిఖిల్ ట్విట్టర్ లో వివరణ ఇచ్చారు. సినిమా రిలీజ్ వాయిదా వేసినందుకు క్షమాపణలు కూడా చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here