భారీ అంచనాల మధ్య వచ్చిన ‘లై’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ మేఘా ఆకాష్. అదే ఆమెకు మొదటి సినిమా. టాలెంట్ కు, అందానికి కొదవలేదు. కాలమే కలిసిరాలేదు.
‘లై’ తరువాత ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ నిర్మించిన ‘చల్ మోహన రంగ’ చేసింది. పవన్ నిర్మాత గా త్రివిక్రమ్ కథతో ‘పవన్ క్రియేటివ్ వర్క్స్’ లో వచ్చిన సినిమా కావడంతో బోలెడు ఆశలు పెట్టుకున్నా పాపం … యావరేజ్ గా మిలిగిపోవడం మేఘా ఆకాష్ దురదృష్టం అనే చెప్పాలి. ఈ రెండు తెలుగు సినిమాల తరువాత తన సొంత ఇండస్ట్రీ తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకుంది . రజినీకాంత్ పెట్టలో అవకాశం దక్కించుకుంది. చక్కని నటనతో ఆకట్టుకుంది. తెలుగులో పెద్దగా హిట్ కాకపోయినా.. తమిళంలో ఈ సినిమా హిట్ కొట్టడంతో.. మేఘా ఆకాష్ కు అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.
పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిని తమిళంలో శింబు రీమేక్ చేశాడు. ఇందులో సమంత రోల్ ను మేఘా చేసింది. ఈ సినిమా అక్కడ పెద్దగా ఆడకపోవడం మేఘా దురదృష్టం అనే చెప్పాలి. ప్రస్తుతం మేఘా తమిళంలో మూడు, హిందీలో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాలైనా ఆమె లైఫ్ ను టర్న్ చేస్తాయోమో చూడాలి.



