అన్ని సినిమాలు ఒక ఎత్తు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఆయన 25వ సినిమా మరో ఎత్తులా మారింది. దాదాపు రెండు మూడేళ్లుగా కసరత్తు చేసి రెడీ చేసిన కథతో వంశీపైడిపల్లి మహేష్ బాబును తెరపై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు.
మహర్షిలో ఎన్నో భిన్న పార్వ్యాలున్నాయని ఫస్ట్ లుక్ లు, టీజర్ లు పాటల థీమ్ లు చూస్తే మనకు అర్థమవుతోంది.
పూజాహెగ్డే, అల్లరి నరేష్ ఇందులో మహేష్ ఫ్రెండ్ గా నటించారు. వీరు ముగ్గురు కలిసి చదువుకోవడం.. అనంతరం మహేష్ గొప్ప బిజినెస్ మ్యాన్ అయినట్టు మనకు చూచాయగా అర్థమవుతోంది.
ఇక తాజాగా మహేష్ రైతు పాత్రలో రైతులతో కలిసి నడుస్తున్న ఫొటో ఒకటి రిలీజ్ అయ్యింది. విద్యార్థిగా చదువుకోవడం ఓకే.. ఆ తర్వాత ఆ చదివిన చదువుతో బిజినెస్ మ్యాన్ గా ఎదగడం వరకూ అంతా మనం అనుకున్నట్టే ఉంది. కానీ ఈ రైతు పాత్ర ఊహించలేకుండా ఉంది. అన్ని కోట్ల అధిపతి రైతుగా మారి ఏం చేశాడన్నది సస్పెన్స్ గా మారింది.
తాజా ఫొటోలో కూడా మహేష్ రైతుగా మారి వస్తున్న ఫొటో ఆసక్తి రేపుతోంది. ఒక్క ఫొటోతో ప్రేక్షకుల్లో ‘మహర్షి’సినిమాపై ఆసక్తిని పెంచేశారు యూనిట్ సభ్యులు. మరి మే 9న రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూడడం తప్పితే మనం చేసేదేమీ లేదు. లెట్స్ వెయిట్ అండ్ సీ..


