థ్రిల్లింగ్‌, డివోషనల్‌ అంశాలతో తెరకెక్కిన ‘దిక్సూచి’ తప్పకుండా ష్యూర్‌ షాట్‌ హిట్‌ అవుతుంది – నటుడు, దర్శకుడు దిలీప్‌కుమార్‌ సల్వాది

0
484

దిలీప్‌కుమార్‌ సల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న డివోషనల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దిక్సూచి’. ఈ చిత్రాన్ని బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏప్రిల్‌ 26న వరల్డ్‌వైడ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

నటుడు, దర్శకుడు దిలీప్‌ కుమార్‌ సల్వాది మాట్లాడుతూ – ”ఏప్రిల్‌ 26న మా ‘దిక్సూచి’ సినిమాను గ్రాండ్‌గా తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్‌, మెల్‌బోర్న్‌ లో విడుదల చేస్తున్నాము. నిన్ననే మా సినిమా సెన్సార్‌ పూర్తయ్యింది. సెన్సార్‌ వారు ఒక్క కట్‌ కూడా లేకుండా యు/ఎ సర్టిఫికెట్‌ ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. ప్రస్తుత కాలంలో ఎలాంటి కట్‌ చెప్పకుండా సెన్సార్‌ పూర్తి చేసుకోవడం అరుదు. సెన్సార్‌ సభ్యులు కూడా మా టీమ్‌ను మంచి సినిమా తీశారు అని అభినందించారు. మా సినిమా మాగ్జిమమ్‌ థియేటర్స్‌లో విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. యూఎస్‌లో మా మిత్రుడు జేమ్స్‌ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఆయనకు చాలా థాంక్స్‌. మా సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ. సెమీ పీరియాడిక్‌ ఫిల్మ్‌. థ్రిల్లింగ్‌, డివోషనల్‌ అంశాలతో తీసిన ఈ చిత్రం ఈ సంవత్సరం ది బెస్ట్‌ మూవీగా ఉంటుందని, మా సినిమా షూర్‌ షాట్‌ హిట్‌ అవుతుందని మా టీవ్‌ు అంతా ఎంతో నమ్మకంగా ఉన్నాము. ఆస్ట్రేలియా, అమెరికాలో ఒక రోజు ముందుగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము” అన్నారు.

http://industryhit.com/t/2019/04/diksoochi-press-meet-pics/

చిత్ర నిర్మాత నరసింహ రాజు రాచూరి మాట్లాడుతూ – ”కంటెంట్‌ ఉన్న మూవీ. మా సినిమాలో మద్యం కాని, సిగరెట్‌, ఎలాంటి అశ్లీలత ఉండదు. మంచి సినిమా ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను మా దర్శకుడు దిలీప్‌ తెరకెక్కించారు. సినిమా చాలా బాగుంది. తప్పకుండా మీ అందరి సపోర్ట్‌ కావాలి” అన్నారు.

డా. జేమ్స్‌ మాట్లాడుతూ – ”నేను 20 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నా.. ప్రొడ్యూసర్‌గా ‘నువ్వుతోపురా’ సినిమాను నిర్మించా.. త్వరలోనే ఈ సినిమా విడుదలకి సిద్దంగా ఉంది. ఎన్‌.ఆర్‌.ఐ లు ఇండస్ట్రీకి రావడం మంచి పరిణామం. ఈ సినిమాను వీలైనన్ని ఎక్కువ థియోటర్స్‌లో విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాను” అన్నారు.

హీరోయిన్‌ చాందిని భగవనాని మాట్లాడుతూ – ”ఈ సినిమా కోసం మా టీమ్‌ అందరం ఎంతో హార్డవర్క్‌ చేశాం. దర్శకుడు చాలా హానెస్ట్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా సినిమా అన్ని అంశాలతో ఫుల్‌ ప్యాకేజ్‌లా ఉంటుంది. తప్పకుండా అందరూ సపోర్ట్‌ చేయండి” అన్నారు.

http://industryhit.com/t/2019/04/chandni-bhagwanani-pics/

దిలీప్‌కుమార్‌ సల్వాది, చత్రపతి శేఖర్‌, సమ్మెట గాంధీ, చాందిని భగవనాని, సుమన్‌, రజితసాగర్‌, అరుణ్‌బాబు, ధన్వి నటించిన ఈ చిత్రానికి కెమెరా: జయక ష్ణ, రవికొమ్మి, మ్యూజిక్‌ డైరెక్టర్‌: పద్మనాభ్‌ భరద్వాజ్‌, లిరిక్స్‌: శ్రీరామ్‌ తపస్వీ, పి.ఆర్‌.ఓ: సాయి సతీష్‌, ప్రొడ్యూసర్స్‌: నర్సింహరాజు రాచూరి, శైలజా సముద్రాల, స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, కట్స్‌: డైరెక్షన్‌: దిలీప్‌కుమార్‌ సల్వాది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here