మహేష్ ‘మహర్షి’ స్టూడెంట్.. సెంటిమెంట్

0
7

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పటికి 25 సినిమాలు తీశాడు.అందులో ఎన్నో క్లాసిక్ హిట్స్.. కానీ విద్యార్థిగా తీసిన ‘ఒక్కడు’ మాత్రం మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్.. అప్పటికే 130 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకొని సంచలన విజయం సాధించింది. టాలీవుడ్ లోనే క్లాసిక్ మూవీల్లో ‘ఒక్కడు’ మూవీ ఒకటి.

మహేష్ బాబు ఇందులో ఓ విద్యార్థి, జాతీయ జట్టుకు ఎంపికయ్యేందుకు కబడ్డీలో రాణిస్తుంటారు. అతడి ఫ్రెండ్స్, పాతబస్తీలో వేసే అల్లరి పనులు.. మధ్యలో వచ్చిన భూమిక పాత్ర ఇలా అన్నీ విద్యార్థిగానే మహేష్ ను చూపించారు. ఆ సినిమా వెండితెరపై అలరించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు కూడా మహేష్ బాబు ఓ విద్యార్థినే.. 7వ సినిమా ఒక్కడులో హ్యాండ్సమ్, డైనమిక్ విద్యార్థిగా కనిపించిన మహేష్ తన కెరీర్ లోని 25వ సినిమా ‘మహర్షి’లో కూడా విద్యార్ధి గా రఫ్ లుక్ లో ఆ తర్వాత స్టైలిష్ బిజినెస్ మాన్ గా అలరించనున్నారు.

మహేష్ బాబుకు విద్యార్థిగా చేసిన సినిమా ‘ఒక్కడు’ బిగ్గెస్ట్ హిట్. మరి 25వ సినిమాలో కూడా మహేష్ స్టూడెంట్.. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు కలిసివచ్చే అవకాశాలున్నాయి. ఇందులో అల్లరి నరేష్ స్నేహితుడిగా.. పూజా హెగ్డే కథనాయికగా ఉన్నారు. స్నేహితుడు నరేష్ కోసం విద్యార్థి నుంచి ఫారిన్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఎదిగిన మహేష్ ఏం చేశాడన్నది చూపిస్తారట.. మహేష్ స్టూడెంట్ ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో హైలెట్ అంటున్నారు. చూడాలి మరి.. ఒక్కడుగా అలరించిన మహేష్ .. ఇప్పుడు ‘మహర్షి’తో ఏం మాయచేస్తాడో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here