హిందీ అర్జున్ రెడ్డి.. జూన్ 21..

0
5

తెలుగు అర్జున్ రెడ్డి ఓ సంచలనం.. అప్పటివరకూ మూసధోరణితో సాగిన తెలుగు సినిమాలను నాటి నాగార్జున ‘శివ’ ఎలాగైతే కొత్త ఒరవడి నేర్పిందో.. ఇప్పట్లో ‘అర్జున్ రెడ్డి’ కూడా సరికొత్త నడతను నేర్పింది. స్వయంగా డాక్టర్ చదివిన సందీప్ రెడ్డి వంగా.. మెడిసిన్ స్టూడెంట్స్ జీవితాల్లోని చీకటి వెలుగులను అద్భుతంగా ‘అర్జున్ రెడ్డి’ ద్వారా వెండితెరపై ఆవిష్కరింప చేశారు. విజయ్ దేవరకొండ లాంటి నటుడు ఈ సినిమాకు ప్రాణం పెట్టి నటించాడు. అర్జున్ రెడ్డి అంటేనే విజయ్ లా పరిస్థితి మారింది..

అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ నటన చూశాక దీన్ని తమిళంలో కూడా నిర్మించారు . విక్రమ్ కొడుకును హీరోగా పెట్టి తీసిన సినిమా ఆశించిన స్థాయిలో లేదని మళ్లీ రీష్యూట్ చేస్తున్నారు.

ఇక హిందీలో అర్జున్ రెడ్డిని ఇక్కడ తీసిన సందీప్ రెడ్డినే తెరకెక్కిస్తున్నారు దీంతో అక్కడ కూడా అంచనాలు పెరిగిపోయాయి. నిజానికి హిందీ అర్జున్ రెడ్డిగా నటిస్తున్న షాహిద్ కపూర్ కూడా ఒకానొక సమయంలో తాను కూడా ‘విజయ్ దేవరకొండ’ నటనను అందుకోలేకపోయానంటూ వ్యాఖ్యానించారంటే ఆ పాత్ర మీద విజయ్ ప్రభావం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు .

తెలుగులో సంచలన విజయాన్ని నమోదు చేసిన అర్జున్ రెడ్డి ఇప్పుడు హిందీలో ‘కబీర్ సింగ్’లా జూన్ 21న వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా అనౌన్స్ మెంట్ బయటకు వచ్చింది. జూన్ 21న కబీర్ సింగ్ విడుదల అవుతుందంటూ రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేశారు. మరి తెలుగునాట సంచలన విజయాన్ని అందుకున్న ఈ మూవీ హిందీలో ఏలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here