నాని సన్ రైజర్స్ తరుఫున ఆడాల్సిందే… విజయ్ దేవరకొండ

0
439

నేచురల్ స్టార్ నాని మేనియా కొనసాగుతోంది. జెర్సీలో నాని నటనకు ఫిదా అవ్వని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. బాహుబలి తర్వాత అంతటి రేటింగ్ నాని నటించిన ‘జెర్సీ’కి వచ్చిందంటే క్రిటిక్స్, జనాల మదిలో ఈ సినిమా ఎంతటి ముద్ర వేసిందో అర్థం చేసుకోచ్చు.

ఇప్పటికే జెర్సీ చూసిన ఎన్టీఆర్, మంచు మనోజ్, అల్లు అర్జున్ లు నాని నటనను వేయినోళ్ల పొగిడారు. నాని క్రికెటర్ గా ఒదిగిపోయాడని.. జీవించి నటించాడని ప్రశంసలు కురిపించారు. నాని నటన ఈ సినిమాలో ఎవరెస్ట్ అంటూ కితాబిచ్చారు.

కాగా తాజాగా ఆదివారం రాత్రి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘జెర్సీ’ సినిమా చూశాడు. సినిమా పూర్తయ్యాక ట్వీట్ చేశాడు. ‘నానికి నా మొత్తం ప్రేమను అందిస్తున్నాను. చప్పట్లతో, ఎలాగైనా ఈ సినిమాను అభినందించడానికి వెనుకాడను. దర్శకుడి మదిలో ఇంత మంచి సినిమా కథ ఆలోచన చూసి ఆశ్చర్యపోయాను.. నాని జెర్సీలో ఆడిన క్రికెట్ చూశాక .. అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడితే మరిన్ని విజయాలు తథ్యం’ అంటూ విజయ్ పొగడ్తలతో ముంచెత్తారు..

నాని ‘జెర్సీ ’ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ దిగ్గజ కోచ్ ను పెట్టుకొని క్రికెట్ నేర్చుకున్నాడు. చాలా రోజులు శ్రమకోర్చి అచ్చం క్రికెటర్ లా మారాడు. అందుకే సినిమా క్రికెట్ నేపథ్యంలో అంత రియాలిటీగా వచ్చింది. నాని పడ్డ శ్రమకు సన్ రైజర్స్ తరుఫున కూడా ఆడితే విజయాలంటూ విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాని కష్టాన్ని ఈ ట్వీట్ తెలియజెప్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here