జూనియర్ శ్రీదేవి అనిపిస్తోందిగా!

0
6

అందం.. నటన విషయం లో మునుపటి తరం శ్రీదేవిని మ్యాచ్ చేయగలిగినవారు అతి తక్కువమంది ఉంటారు. అదే కనుక స్టార్డమ్ విషయం తీసుకుంటే శ్రీదేవి వన్ అండ్ ఓన్లీ. సాధారణ ప్రేక్షకులే కాదు చాలామంది సెలబ్రిటీలు కూడా శ్రీదేవి అభిమానులే.. ఆ విషయం వాళ్ళు ఓపెన్ గానే చెప్తారు. నాగార్జున.. మహేష్ లాంటి వారు తమ ఫేవరెట్ శ్రీదేవి అని గతంలోనే చెప్పారు. ఇక రామ్ గోపాల్ వర్మ అయితే శ్రీదేవి ఆరాధకుడు! అలాంటి లెజెండరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆమె పెద్ద కుమార్తె జాన్వి. మొదటి సినిమా ‘ధడక్’ తో పరవాలేదనిపించుకున్న జాన్వి శ్రీదేవిని మరిపించేందుకు తీవ్రంగానే శ్రమిస్తోంది.

ఈమధ్యే జాన్వి దాదాసాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరయింది. ఈ కార్యక్రమంలో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ కేటగిరీలో ‘ధడక్’ సినిమాకు గానూ అవార్డు అందుకుంది. సాధారణంగానే ఫ్యాషన్ పట్ల ఎంతో జాగ్రత్త తీసుకునే జాన్వి ఈ ప్రోగ్రామ్ కు ఒక పింక్ కలర్ చీరలో హాజరైంది. ఈ చీర..మ్యాచింగ్ జాకెట్ డిజైన్ చేసినవారు ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా. చూసేందుకు ఎంతో సింపుల్ గా కనిపిస్తున్నా.. సింపుల్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా శారీ ఎంతో అందంగా ఉంది. అలాంటి చీరను మరింత గ్రేస్ ఫుల్ గా ధరించి.. ఎంతో స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ తో కెమెరాకు జాన్వి చక్కని పోజ్ ఇచ్చింది. రెండు చేతులతో చీరకొంగును అలా పట్టుకోవడంలోనే సుకుమారి వయ్యారమంతా బయటపడింది. తలను కాస్త పక్కకు వాల్చి చూస్తున్న ఓరచూపుతో నెటిజనులు జాన్వి మాయలో పడిపోకుండా ఎలా ఉంటారు? రెండు మ్యాచింగ్ నెక్లెస్ లు మినిమం మేకప్ తో.. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన హెయిర్ స్టైల్ తో అందాలబొమ్మలాగా కనిపిస్తోంది. ఇక ఫోటోలో ఆమెకు పక్కగా అవుట్ అఫ్ ఫోకస్ లో మసగ్గా ఉన్న పసుపు రంగు పూలు ఈ ఫోటోకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. అమ్మ శ్రీదేవిలో ఉన్న గ్రేస్ కూడా ఉంది. జాన్వి ఇప్పటివరకూ చేసింది ఒక్క సినిమానే కాబట్టి నటన విషయంలో అప్పుడే లెజెండరీ శ్రీదేవితో పోల్చలేం కానీ అందం విషయంలో జూనియర్ శ్రీదేవి అనిపిస్తోంది జాన్వీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here