‘హీరో హీరోయిన్‌’ టీజర్‌ విడుదల

0
510

స్వాతి పిక్చర్స్‌ బ్యానేర్‌లో ‘అడ్డా’ ఫేమ్‌ జి.ఎస్‌. కార్తీక్‌ దర్శకత్వంలో నవీన్‌చంద్ర హీరోగా, గాయత్రీ సురేష్‌, పూజ జవేరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హీరో హీరోయిన్‌’. ‘ఏ పైరేటెడ్‌ లవ్‌ స్టోరీ’ అనేది క్యాప్షన్‌. ఈరోజు ప్రసాద్‌ ల్యాబ్‌లో ఈ చిత్ర టీజర్‌ను మీడియా సభ్యులు సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ జనార్దన్‌, వీడియోగ్రాఫర్‌ పొన్నం శ్రీనివాస్‌ సంయుక్తంగా టీజర్‌ విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మార్చ్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ముఖ్య అతిథి నిర్మాత బి ఏ రాజు మాట్లాడుతూ -”కార్తీక్‌ నాకు చాలా కాలంగా తెలుసు. మా బేనర్‌లో జయగారి దగ్గర దర్శకత్వశాఖలో పని చేశారు. ‘అడ్డా’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చికున్నారు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌. హీరో నవీన్‌చంద్ర మంచి నటుడు. అతనికి ఈ సినిమా మంచి బ్రేక్‌ ఇస్తుంది. హీరోయిన్‌ గాయత్రి మొదటి సినిమా అయినా బాగా నటించింది. టీజర్‌ చాలా బాగుంది, మంచి రెస్పాన్స్‌ వస్తుంది. పైరసీని అరికట్టాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఓ మంచి పాయింట్‌తో మంచి మెసేజ్‌ ఓరియంటెడ్‌గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి, ఆడియన్స్‌కి కూడా అవసరం. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌ను విభిన్న తరహాలో ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత భార్గవ్‌. తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది” అన్నారు

సురేష్‌ కొండేటి మాట్లాడుతూ – ” కార్తీక్‌ ‘అడ్డా’ సినిమా నుండే నాకు మంచి ఫ్రెండ్‌. టీజర్‌ బాగుంది. టాగ్‌ లైన్‌ చాలా బాగుంది. ఈ సినిమా ద్వారా నవీన్‌ చంద్ర మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఈసినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది” అన్నారు.

చిత్ర దర్శకులు కార్తీక్‌ మాట్లాడుతూ – ”’అడ్డా’ తరువాత నేను చేస్తున్న సినిమా. ఈ సినిమా పైరసీ బ్యాక్‌ డ్రాప్‌లో ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఇంటర్‌నెట్‌ చాలా అభివ ద్ది చెందడంతో పైరసీ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. కేవలం పైరసీ మీదనే సినిమా చేస్తే డాక్యుమెంటరీలా ఉంటుంది అని అన్ని రకాల ఎమోషన్స్‌తో ఉండే ఒక ఇంటెన్స్‌ లవ్‌స్టోరీని రాసుకోవడం జరిగింది. ఈ సినిమా స్టోరీ రాస్తున్నప్పుడే నవీంచంద్ర హీరో అనుకున్నాను. ఈ సినిమాలో హీరో నవీన్‌చంద్ర నెగటివ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఇలాంటి సినిమా చేయాలంటే హీరోలకు కొంచెం భయంగా ఉంటుంది.. కానీ నవీన్‌చంద్ర చాలా ధైర్యంగా ఈ సినిమాను ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్‌. హీరోయిన్‌ గాయత్రి సురేష్‌ ఫుల్‌ పాజిటివ్‌ క్యారెక్టర్‌. ఒక ప్రముఖ నిర్మాత కూతురిగా చాలా చక్కగా నటించింది. ప్రొడ్యూసర్‌ భార్గవ్‌కి ఇది మొదటి సినిమా అయినా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాకు ఎంత అవసరమో అంత ఖర్చుపెట్టారు. ఆయన వల్లే సినిమా ఇంతబాగా వచ్చింది. పైరసీ మీద సినిమా కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళ సపోర్ట్‌ ఉండాలని ఇండస్ట్రీ వాళ్ళ కోసం ఒక స్పెషల్‌ షో ను వేయబోతున్నాం చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలు, దర్శకులు, హీరోహీరోయిన్స్‌ హాజరవుతారు” అన్నారు.

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ – ”తమ సినిమాలు పైరసీ అవుతాయని తెలిసినా కేర్‌ చేయకుండా మంచి సినిమాలు తీసే నిర్మాతలుకు హ్యాట్సాఫ్‌. అన్ని కమర్షియల్‌ హంగులున్న సినిమా ఇది. నా తొలి సినిమా ‘అందాల రాక్షసి’ పైరసీ కాపీని చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే ఈ కథ విన్నప్పుడు చాలా ఎగ్జయిట్‌గా అనిపించింది. ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోల అభిమానులు కలిస్తే పైరసీని తరిమేయగలరు”అన్నారు.

హీరోయిన్‌ గాయత్రి సురేష్‌ మాట్లాడుతూ – ”తెలుగులో నటించాలనేది నా కల ఈ సినిమా ద్వార అది నెరవేరింది. పవర్‌ఫుల్‌ సినిమా ఇది. అన్ని కమర్షియల్‌ హంగులతో పాటు రొమాంటిక్‌ అంశాలు కూడా ఉన్నాయి” అన్నారు.

నిర్మాత భార్గవ్‌ మన్నె మాట్లాడుతూ – ”పైరసీ అనేది ప్రస్తుతం బర్నింగ్‌ ఇష్యూ. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా ఇది. డిఫరెంట్‌ సినిమా అవుతుంది. గోవాలో చిత్రీకరించే ఒక్క పాట మిగిలి ఉంది. మార్చిలో విడుదల చేస్తాం” అన్నారు.

నటీనటులు:
నవీన్‌ చంద్ర, గాయత్రి సురేష్‌, పూజా జవేరి, అభిమన్యుసింగ్‌, కబీర్‌సింగ్‌, జయప్రకాష్‌,షేకింగ్‌ శేషు, రణధీర్‌, గౌతంరాజు, శివన్నారాయణ,బమ్‌చిక్‌బబ్లూ,సారికరామచంద్రరావు తదితరులు

సాంకేతిక నిపుణులు
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి.యస్‌.కార్తిక్‌, నిర్మాత: భార్గవ్‌ మన్నె, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: కిరణ్‌ కుమార్‌ మన్నె, కెమెరా: వెంకట్‌ గంగాధరీ, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, లిరిక్స్‌: అనంత శ్రీరామ్‌, కల్యాణ్‌ చక్రవర్తి త్రిపురనేని.

http://industryhit.com/t/2019/02/gayathri-suresh-pics/

http://industryhit.com/t/2019/02/hero-heroine-teaser-launch-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here