మా ‘4 లెటర్స్‌’ టీజర్‌, ఆడియోకి వస్తోన్న రెస్పాన్స్‌ సినిమా విజయంపై మాకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది – నిర్మాత దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌

0
163

ఓం శ్రీ చక్ర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.1గా ‘కలుసుకోవాలని’ ఫేమ్‌ ఆర్‌. రఘురాజ్‌ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘4 లెటర్స్‌’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే’ ట్యాగ్‌లైన్‌. ఈశ్వర్‌, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరోహీరోయిన్లుగా ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రిలీజ్‌ చేయగా, ఆడియోను ప్రముఖ దర్శకుడు ఎస్‌.వి. కృష్ణారెడ్డి రిలీజ్‌ చేశారు. టీజర్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. హీరో ఈశ్వర్‌కి ఇది తొలి చిత్రమైనా నటన, డ్యాన్స్‌, ఫైట్స్‌లో మంచి ఈజ్‌ కనబరిచారని టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేయడం విశేషం. అలాగే ఇటీవల రిలీజైన ఆడియోకి కూడా అమేజింగ్‌ రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పటికే దర్శకుడు రఘురాజ్‌ ఈ చిత్రాన్ని యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యేలా ఈ చిత్రాన్ని బాగా తీశారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఫిబ్రవరి 2వ వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ‘4 లెటర్స్‌’ ప్రొడ్యూసర్‌ దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌తో ‘ఇండస్ట్రీహిట్‌’ ఇంటర్వ్యూ.

మీ నేపథ్యం గురించి చెప్పండి?
– మాది తిరుపతి. చెన్నైలో మాస్టర్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంటల్‌్‌ ఇంజనీరింగ్‌ చేశాను. ఆ తర్వాత సిపిడబ్ల్యూడి (సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌)లో మూడేళ్లు సివిల్‌ ఇంజనీర్‌గా పని చేసి 1997లో అమెరికా వెళ్ళాను. దాదాపుగా 21 ఏళ్లుగా న్యూయార్క్‌ సిటీలో ఉంటున్నాను. వ త్తి పరంగా న్యూయార్క్‌ సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ పోర్టేషన్‌లో డైరెక్టర్‌గా పని చేస్తున్నాను. నా వ త్తి పరంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక నా ఫ్యామిలీ విషయానికొస్తే… నా వైఫ్‌ పేరు హేమలత. మాకిద్దరు పిల్లలు ఈశ్వర్‌, దివ్య. మా ఫ్యామిలీ అందరికీ సినిమాలన్నా, సంగీతమన్నా చాలా ఇష్టం.

న్యూయార్క్‌లో గవర్నమెంట్‌ ఎంప్లాయ్‌గా వర్క్‌ చేస్తూ సినిమా రంగంలోకి రావడానికి రీజన్‌?
– చాలా కాలం క్రితం మా నాన్నగారు సినిమాలు నిర్మించాలని చెన్నై వెళ్లారు. అలా మా ఫ్యామిలీకి సినిమా ఫీల్డ్‌తో సంబంధాలు ఉన్నాయి. కానీ మా నాన్నగారు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. నేను కూడా సినిమాలపై పెద్దగా ద ష్టి పెట్టలేదు. మా అబ్బాయి ఈశ్వర్‌కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇంట్రస్ట్‌. అలాగే మ్యూజిక్‌ అంటే కూడా ఎంతో ఆసక్తి. అలా కర్ణాటక వోకల్‌ నేర్చుకున్నాడు. తబల, ఫ్లూట్‌, ప్లే చేయగలడు. మంచి సింగర్‌ కూడా. నాటా ఐడల్‌ ప్రొగ్రామ్స్‌లో చాలా సార్లు పార్టిసిపేట్‌ చేశాడు. న్యూయార్క్‌లో ఉన్న తెలుగు అసోసియేషన్‌లో మా పిల్లలిద్దరూ చాలా యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో కల్చరల్‌ ప్రొగ్రామ్స్‌ చేసేవారు. మా అమ్మాయి దివ్య న్యూయార్క్‌ సిటీలో పదేళ్ల పాటు భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. 2016 అగస్ట్‌లో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో భరతనాట్య ప్రదర్శనిచ్చి… ఆ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖనటి, క్లాసికల్‌ డాన్సర్‌ మంజు భార్గవి ప్రశంసలు పొందడం విశేషం. అలా ఈశ్వర్‌ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్‌ చేస్తుండటంతో స్టేజ్‌ ఫియర్‌ అనేది పోయింది. ఇలాంటి క్రమంలో మూడేళ్ల క్రితం యాక్టింగ్‌పై ఇంట్రస్ట్‌ ఉందని చెప్పాడు. అప్పుడే వైజాగ్‌కి చెందిన మిత్రుడొకరు సత్యానంద్‌గారు అని ఒకరు ఉన్నారు. ఎంతో మంది పెద్ద హీరోలకు సైతం యాక్టింగ్‌ నేర్పించారు. వారి దగ్గరకు పంపించండి అని చెప్పారు. అలా వైజాగ్‌ సత్యానంద్‌గారిని సంప్రదించడం, వారి వద్ద యాక్టింగ్‌లో శిక్షణ ఇప్పించడం జరిగాయి. సత్యానంద్‌గారు కూడా ఎంతో కేర్‌ తీసుకుని యాక్టింగ్‌ నేర్పించారు. ఈశ్వర్‌ లో మంచి యాక్టర్‌ ఉన్నాడు, సినిమాపట్ల ఎంతో ప్యాషన్‌ కూడా ఉంది. తనని హీరోగా పెట్టి సినిమా తీయొచ్చు అని సత్యానంద్‌గారు చెప్పడంతో… మాకు ఈశ్వర్‌ పై మరింత నమ్మకం పెరిగింది. లాస్ట్‌ ఇయర్‌ మేలో తన డిగ్రీ పూర్తయింది. తను ఐదేళ్ల వయస్సులోనే అమెరికా వచ్చినా కానీ, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలడు. అలాగే ఈశ్వర్‌ యాక్టింగ్‌తో పాటు డైరక్షన్‌ చేస్తూ ‘ఆ ఇద్దరూ’ అనే ఒక షార్ట్‌ ఫిలిం కూడా చేశాడు. తను డాక్టర్‌ కావాలన్నది నా కోరిక. కానీ తను యాక్టర్‌ అవుతా అన్నాడు. ఇక తన ఇష్టానికే ప్రాధాన్యత ఇస్తూ ఎంకరేజ్‌ చేస్తున్నాం. అందుకే మేమే బేనర్‌ స్థాపించి ఈశ్వర్‌ హీరోగా ‘4 లెటర్స్‌’ సినిమా ప్రారంభించాం.

సినిమా రంగం మీకు కొత్త కదా, ఏమైనా ఇబ్బందులు ఎదురుయ్యాయా?
– నిజం చెప్పాలంటే… సినిమా ఫీల్డ్‌కు నా ఫీల్డ్‌కు అసలు సంబంధం లేదు. నేను సివిల్‌ ఇంజనీర్‌ని. న్యూయార్క్‌తో పాటు ఇక్కడ కూడా పలు సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌లు ఉన్నాయి. కానీ సినిమా అంటే ఒక ప్రేక్షకుడుగా తెలుసు తప్ప సినిమా నిర్మాణం పై ఏమాత్రం అవగాహన లేదు. అయినా ఎక్కడా ఇబ్బంది లేకుండా సినిమా ప్రారంభించి పూర్తి చేసామంటే మా టీమ్‌కే ఆ క్రెడిట్‌ దక్కుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే నేను న్యూయార్క్‌లో వర్క్‌లో బిజీగా ఉన్నప్పటికీ మా దర్శకుడు రఘురాజ్‌ ఈ సినిమాని ఛాలెంజింగ్‌గా తీసుకొని, ఎంతో బాధ్యతతో తెరకెక్కించారు.

‘కలుసుకోవాలని’ సినిమా తర్వాత డైరక్టర్‌ రఘురాజ్‌ తెలుగు సినిమా చేయలేదు, ఆయనని ఎలా అప్రోచ్‌ అయ్యారు?
– ప్రొడక్షన్‌ మేనేజర్‌ భాస్కర్‌ రాజుగారు రఘురాజ్‌గారిని పరిచయం చేశారు. ‘కలుసుకోవాలని’ సినిమా తెలుగులో పెద్ద సక్సెస్‌ అయింది. ఆ తర్వాత తమిళ్‌, కన్నడలో చాలా సినిమాలు చేస్తూ బిజీ వల్ల తెలుగులో సినిమా చేయలేకపోయారని తెలుసుకున్నా. అందులో రఘురాజ్‌గారు అబ్రాడ్‌ వెళ్లి టెక్నికల్‌గా మెరుగవడానికి కొన్ని కోర్సులు చేసారు. హీ ఈజ్‌ వెరీ టాలెంటెడ్‌. మాకు సినిమా రంగం పై అనుభవం, అవగాహన లేకున్నా.. అన్నీ తానై చూసుకున్నారు. అలాగే మా అబ్బాయితో అద్భుతంగా యాక్ట్‌ చేయించుకున్నారు. మేము డైరక్టర్‌ని నమ్మి సినిమా చేశాం. అందుకు తగ్గట్లుగానే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా విజయంపై మేమెంతో కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం.

సినిమా రంగం అనగానే కొంత మంది, భయపెడతారు, భయపడతారు.. అలాంటి సందర్భం మీకు ఎదురైందా?
– మొదట సినిమా రంగం అనగానే కొంత మంది మిత్రులు భయపెట్టిన మాట వాస్తవమే. ఏ రంగంలో అయినా నమ్మకం అనేది ముఖ్యం. నమ్మకంతో చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. అలా మా టీమ్‌ని నమ్మి సినిమా చేశాం. మేం నమ్మినట్టుగానే అందరూ హార్ట్‌ఫుల్‌గా పని చేసి ఒక మంచి సినిమా ఇచ్చారు.

ఈ సినిమా విషయంలో మీకు సహకరించినవారు?
– మా ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ భాస్కర్‌ రాజు, రామక ష్ణ, మోహన్‌ రాజు ఎంతో సపోర్ట్‌ చేశారు. అలాగే నా సొంత తమ్ముడు భాస్కర్‌ రాజు దొమ్మరాజు సినిమా మొత్తం తనే చూసుకున్నాడు. ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది రాకుండా సినిమా కంప్లీట్‌ అయిందంటే ఆ క్రెడిట్‌ అంతా నా తమ్ముడు భాస్కర్‌ రాజుకే చెందుతుంది.ఈశ్వర్‌ని తన చేతిలో పెట్టాను. నా స్థానంలో ఉంటూ ప్రొడక్షన్‌ పనులన్నీ చాలా బాగా నిర్వహించాడు.

‘4 లెటర్స్‌’ కథలో మిమ్మల్ని ఇంప్రెస్‌ చేసిన అంశాలు?
– కాలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే యూత్‌పుల్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘4 లెటర్స్‌’. ఫ్యూర్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది తప్ప ఎక్కడా విలనిజం అనేది ఉండదు. ప్రజంట్‌ యూత్‌కి బాగా కనెక్టవుతూనే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే రిలేషన్స్‌, ఎమోషన్స్‌ ఉంటాయి. ఎక్కడా డ్రా బ్యాక్‌ అవకుండా ప్రతి సీన్‌ ఆకట్టుకునేలా డైరక్టర్‌ ప్లాన్‌ చేశారు. సినిమా ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు అయిపోయింది అనేది తెలియదు. ఒక కొత్త హీరోకి యాప్ట్‌ అయ్యే స్టోరి కావడంతో నేను ఇంప్రెస్‌ అయ్యాను. నిర్మించడానికి ముందుకొచ్చాను. మా చిత్రం టీజర్‌ రిలీజయ్యాక ఇండస్ట్రీలోని ప్రముఖులు ఈశ్వర్‌.. మంచి అనుభవం ఉన్న హీరోలా ఎంతో ఈజ్‌తో నటించాడు, తనకి హీరోగా మంచి భవిష్యత్‌ ఉంది.. అని ప్రశంసించడం నాకెంతో హ్యాపీగా అన్పించింది. సినిమా రిలీజ్‌ అయ్యాక ప్రేక్షకులు మెచ్చేలా మా సినిమా ఉంటుందని నమ్మకంగా చెప్పగలను.

ఎంతో అనుభవం ఉన్న ప్రొడక్షన్‌ హౌస్‌ లే సినిమాలు చేయాలంటే కొన్నిసార్లు చాలా టైమ్‌ పడుతుంది. అలాంటిది ఇంత షార్ట్‌ టైమ్‌లో సినిమా తీసి, రిలీజ్‌ చేస్తున్నారు ఒక కొత్త ప్రొడక్షన్‌ హౌస్‌కిది ఎలా సాధ్యమైంది?
– పక్కా ప్లానింగ్‌ వల్లే షార్ట్‌ టైమ్‌లో సినిమా చేయగలిగాం. ఇది సాధ్యమైందంటే.. మా ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ మరియు డైరెక్షన్‌ టీమ్‌ వల్లే. ఒకసారి స్క్రిప్ట్‌ లాక్‌ చేసాక ఏమాత్రం డిస్టర్బ్‌ చేయకుండా షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ చేసుకుంటూ వెళ్లిపోయాం. షెడ్యూల్‌ ప్లానింగ్‌లో మా డైరక్టర్‌ చాలా ఎక్స్‌పర్ట్‌. షూటింగ్‌ ప్రారంభించాక ఒక్క రోజు కూడా డిలే కాకుండా సినిమాను 75 రోజుల్లో పూర్తి చేశాం.

టెక్సీషియన్స్‌ గురించి చెప్పండి?
– భీమ్స్‌ సిసిరోలియో ఈ సినిమాలోని నాలుగు పాటలకు ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. ఆయన బాణీలకు తగ్గట్టు సురేష్‌ ఉపాధ్యాయ చక్కటి సాహిత్యాన్ని అందించారు. నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే సినిమాటోగ్రాఫర్‌ చిట్టిబాబు బ్యూటిఫుల్‌ విజువల్స్‌ అందించారు. రెండు పాటలు బ్యాంకాక్‌లో చిత్రీకరించాం. రెండు పాటలు సినిమాలో హైలైట్స్‌గా నిలుస్తాయి. ఇక మా డైరెక్టర్‌ రఘరాజ్‌గారి డైరక్షన్‌, డైలాగ్స్‌, ఎడిటింగ్‌, కథ, కథనాలు సినిమాకు మెయిన్‌ ఎస్సెట్స్‌గా నిలవనున్నాయి.

మీ బేనర్‌లో వరుసగా సినిమాలు చేస్తారా?
– అవునండీ. మా బేనర్‌లో వరుసగా సినిమాలు చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. మా ఈశ్వర్‌తో పాటు మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న టాలెంట్‌ కలిగిన యువ దర్శకులకి, నటీనటులకి మా బేనర్‌ ద్వారా అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం.

స్క్రీన్‌ పై మీ అబ్బాయిని చూసుకోవడం ఎలా అనిపించింది?
– ఇటీవలే ఫస్ట్‌ కాపీ చూసాను. నిజంగా పుత్రోత్సాహం పొందాను. నాతో పాటు చూసిన వారందరూ కూడా ఒక కొత్త హీరోలా కాకుండా ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించాడంటున్నారు. డైలాగ్‌ డెలివరీ కానీ, డాన్స్‌ల్లో కానీ అద్భుతంగా చేసాడు. మొదటి సినిమాలోనే డబ్బింగ్‌ చెప్పడంతో పాటు ఒక పాట కూడా పాడాడు.

రిలీజ్‌ ఎప్పుడు ప్లాన్‌ చేస్తున్నారు?
– మేం ఇటీవల విడుదల చేసిన ఆడియోకు అమేజింగ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. మా సినిమా ‘4 లెటర్స్‌’ టైటిల్‌ ప్రతి ఒక్కరికీ బాగా కనెక్ట్‌ అయ్యింది. ప్రమోషన్‌ ద్వారా సినిమాని జనాల్లోకి మరింత వేగంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. సినిమాను ఫిబ్రవరి రెండోవారంలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here