ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ‘4 లెటర్స్’ – దర్శకుడు ఆర్. రఘురాజ్

0
104

‘కలుసుకోవాలని’ లాంటి మ్యూజికల్‌ సూపర్‌హిట్‌ తర్వాత ఆర్‌. రఘురాజ్‌ దర్శకత్వంలో ఓం శ్రీ చక్ర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందిన చిత్రం ‘4 లెటర్స్‌’. ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక. ఈశ్వర్‌, టువ చక్రబోర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మించారు. ఫిబ్రవరి 2వ వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ‘4 లెటర్స్‌’ దర్శకుడు ఆర్‌. రఘురాజ్‌ ఇంటర్వ్యూ.

‘కలుసుకోవాలని’ తరువాత తెలుగులోచాలాగ్యాప్‌ తీసుకున్నారు?
– మాది విజయవాడ. నేను విజయవాడలో పుట్టి చెన్నెలోపెరిగాను. ‘కలుసుకోవాలని’ సినిమా పూర్తి కాగానే నాచదువు నిమిత్తం అబ్రాడ్‌ వెల్లవలసి వచ్చింది. అక్కడే సినిమాలపై ఉన్న ఆసక్తితో ‘అఫిషియల్‌ డీటేల్‌ ఫిల్మ్‌ మెకింగ్‌ కోర్స్‌’ నేర్చుకున్నాను. ఆ తరువాత తమిళ్‌లో 5 కన్నడలో 3 బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేశాను. ప్రతీ సినిమాకు నాకు మంచి ఆదరణ లభించింది. చాలా కాలం తరువాత తెలుగులో కూడా మంచి సినిమా చేయాలనిపించి ఈ సినిమాతో నాసెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్‌ ్ట చేశాను.

4లెటర్స్‌ ఎలా స్టార్టయ్యింది?
– సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌. ‘కలుసుకోవాలని’ సినిమాకు నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఇండస్ట్రీలో బిగ్‌స్టార్స్‌ అందరూ నన్ను అప్రిసియేట్‌ చేయడం జరిగింది. ఆ సినిమా కంప్లీట్‌ ఫ్యామిలి ఎంటర్‌టైనర్‌.. మాది బేసికల్లీ మ్యూజికల్‌ ఫ్యామిలి కావడంతో నాకు మ్యూజిక్‌పై మంచి అవగాహన ఉంది. అందుకే ‘కలుసుకోవాలని’ సినిమాలో 8 పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. చాలా కాలం తరువాత అలాంటి మంచి స్క్రీన్‌ప్లేతోనే ఉన్న కథ దొరకడంతో ఈ సినిమా స్టార్టయ్యింది.

ఈ సినిమా బేసిక్‌ ఐడియా ఏంటి?
– 4 లెటర్స్‌ మూవీ ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌ని ద ష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. ఈ సినిమాలో ఇంతవరకూ ఎవరూ చేయని ఒక అచీవ్‌మెంట్‌ ఉంది. సినిమా ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌కి అంకితం. ప్రజెంట్‌ ట్రెండ్‌ తగ్గట్లు ఉండే అన్ని అంశాలతో కూడిన లవ్‌స్టోరి కనుక యూత్‌ని బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌, ఆడియోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సినిమా తప్పకండా విజయం సాధిస్తుంది.

హీరో,హీరోయిన్‌ల పెర్‌ఫామెన్స్‌ గురించి?
– హీరో ఈశ్వర్‌ ఒరిస్సాలో అతనితో నాలుగు కెమెరాలతో టెస్ట్‌ షూట్‌ చేయడం జరిగింది. కొత్త వాడిలా కాకుండా అనుభవమున్న నటుడిలా అద్భుతంగా నటించారు. ఇక హీరోయిన్‌ టువ చక్రబోర్తి కోల్‌కతా నుండి, అంకిత మిస్‌ బెంగుళూరు. ఫస్ట్‌ టైం అయినా చాలా బాగా నటించారు. ఈ సినిమాలో సురేష్‌, పోసాని, సుధ, దన్‌రాజ్‌, నగేష్‌ లాంటి చాలా మంది సీనియర్‌ ఆర్టిస్టులు నటించారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్‌ సిసిరోలియో, డిఓపి చిట్టి బాబు గురించి?
– మా ఇంట్లో స్వతహాగా అందరూ సంగీతాభిమానులే..ఈ సినిమా సంగీతం విషయంలో చాలా కేర్‌ తీసుకోవడం జరిగింది. భీమ్స్‌ కూడా ఈ సినిమాకు అత్యద్భుతమైన మ్యూజిక్‌ ఇవ్వడం జరిగింది. భీమ్స్‌ సంగీతం, బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకు ఒక పిల్లర్‌ అని ఆడియో విన్న ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌ విషయానికి వస్తే చిట్టిబాబు ఈ సినిమాకు ఇంకో పిల్లర్‌. ఒక ఆర్టిస్ట్‌ ఎమోషన్‌ని క్రియేట్‌ చేయడంలో సినిమాటోగ్రాఫర్‌ పాత్ర చాలా ఉంటుంది. చిట్టిబాబు చాలా మంచి సపోర్ట్‌ ఇచ్చారు.

సినిమా మొత్తం సింగల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేశారంట?
– నేను చేసే పని విషయంలో చాలా కేర్‌ తీసుకుంటాను. ఇక షూటింగ్‌ సమయంలో స్క్రిప్ట్‌ బుక్‌లెట్‌ చేసి ఆర్టిస్టులకి ఇస్తాను. నా సినిమాలకి నేనే ఎడిటర్‌ కాబట్టి సినిమాకు ఎంత కావాలో అంతే షూట్‌ చేస్తాను.

ఓం శ్రీ చక్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌?
– మేము ఈ చిత్రాన్ని రిచ్‌లోకేషన్స్‌లో చిత్రికరించాం. థాయిలాండ్‌లోని ప్రత్వేకమైన ప్రదేశాల్లో పాటలు షూట్‌చేశాం. ప్రీ-ప్రొడక్షన్‌, షూటింగ్‌, పోస్ట్‌-ప్రొడక్షన్‌తో కలిపి మొత్తం 75 రోజుల్లో ఫస్ట్‌కాపీ రెడీ చేశాం. మేము చేసుకున్న ప్లానింగ్‌ షెడ్యుల్‌కి సహకరించిన దొమ్మరాజు భాస్కర్‌ రాజు గారికి థాంక్స్‌.

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
– మా టైటిల్‌ మీనింగ్‌ ఏంటనేది ట్యాగ్‌ లైన్‌ చూస్తే అర్థమవుతోంది. మా టైటిల్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాలో హీరో ఫాదర్‌కి POORఅనే ఫోర్‌ లెటర్స్‌ నచ్చవు..మరోవైపు హీరోయిన్‌ మదర్‌కి RICH అనే ఫోర్‌ లెటర్స్‌ నచ్చవు..హీరోయిన్‌ LOVE అనే ఫోర్‌ లెటర్స్‌తో సతమతమవుతుంది..హీరోయిన్‌ ఫాదర్‌ జీవితంలో FAIL అనే ఫోర్‌ లెటర్స్‌ తప్ప ఏం అనుభవించడు..హీరో ఫ్రెండ్స్‌ PASS అనే ఫోర్‌ లెటర్స్‌ గురించి ఆలోచించరు..యూత్‌కి నచ్చే ‘4 లెటర్స్‌’ చూట్టూ సినిమా తిరుగుతుంది. సినిమా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది అందుకే ఆ టైటిల్‌ పెట్టాం. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అంతర్లీనంగా యూత్‌ అనుకుంటే ఏమైనా చేయగలరు.. అనే మెసేజ్‌ కూడా ఈ సినిమాలో ఉంటుంది.

మీ నెక్ట్‌ ప్రాజెక్ట్స్‌ ఎంటి?
తెలుగుతోనే ఫుల్‌ లెంగ్త్‌ సినిమాలతో కంటిన్యూఅవుదామనుకుంటున్నాను. ఇకపై అన్ని జోనర్స్‌లో మూవీస్‌ చేస్తాను. కొన్ని ఐడియాస్‌ ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆ స్క్రిప్ట్‌ని డెవలప్‌ చేస్తాను. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here