మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్‌లో.. శ్రీమతి డి. పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అగ్ర నిర్మాత దానయ్య డి.వి.వి. నిర్మించిన కమర్షియల్‌ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వినయ విధేయ రామ’. ‘భరత్‌ అనే నేను’ వంటి సూపర్‌డూపర్‌ హిట్‌ తర్వాత కియారాఅద్వాని హీరోయిన్‌గా డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న భారీ చిత్రమిది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ కియారాఅద్వాని ఇంటర్వ్యూ.

కెరీర్ స్టార్టింగ్ లోనే మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో వర్క్ చెయ్యడం ఎలా అనిపించింది?
ఆ విషయంలో ఐ యామ్ బ్లెస్స్ డ్ అండి. అందరికి ఈ అదృష్టం దక్కదు. అంత పెద్ద స్టార్స్ అయినా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. చాలా డీసెంట్ హీరోస్. అందుకే వారిద్దరికి లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు. సెట్ లో చాలా కంఫర్ట్ ఉంటుంది. ఐ యామ్ సో లక్కీ.

వినయ విధేయ రామ స్టోరీ విన్నప్పుడు ఎలా ఫీల్‌ అయ్యారు?
దర్శకుడు బోయపాటి శ్రీను గారు ఈ సినిమా స్టోరీ నరేట్‌ చేసినపుడే పూర్తి సినిమా చూసేశాననే ఫీలింగ్‌ వచ్చింది. అంత గొప్పగా చెప్పారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ విన్నాననిపించి ఇమీడియట్‌గా ఓకె చెప్పాను.

ఈ సినిమా స్టార్‌కాస్ట్‌ గురించి?
నేను ఇంత పెద్ద స్టార్‌కాస్ట్‌ ఉన్న సినిమా చేయలేదు. రామ్‌ చరణ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌, స్నేహ లాంటి 15 మంది టాప్‌ యాక్టర్స్‌తో నటించడం అనేది అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. సెట్స్‌ దగ్గరి నుండి ప్రతీది లార్జర్‌ దెన్‌ లైఫ్‌ అనిపించేలా సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చింది.

దర్శకుడు బోయపాటి గారి మేకింగ్‌ స్టైల్‌?
బోయపాటి గారు ఇన్‌క్రిడబుల్‌ డైరెక్టర్‌. న్యాచురల్‌ ఎలిమెంట్స్‌ని ప్రెజెంట్‌ చేయడం వేరు.. ఏదైతే నమ్మడానికి వీల్లేకుండా ఉంటాయో, వాటిని నమ్మేంతగా.. ఫీలయ్యేంతగా మెస్మరైజ్‌ చేస్తూ స్క్రీన్‌పై ఎలివేట్‌ చేయడం చాలా కష్టం. అది బోయపాటి లాంటి ఫిల్మ్‌ మేకర్స్‌కే సాధ్యమవుతుంది. ఇది కూడా ఆయన బ్రాండ్‌ ఫిలిం.

రామ్‌ చరణ్‌ తో స్క్రీన్‌షేర్‌ చేసుకోవడం ఎలా అనిపించింది?
చరణ్‌ ఫ్యాబులెస్‌ హీరో. బేసిగ్గా డ్యాన్స్‌ అంటే ఇష్టం కాబట్టి చరణ్‌ లాంటి డ్యాన్సర్‌తో స్టెప్స్‌ వేస్తూ, చాలా ఎంజాయ్‌ చేశా. నాకు ‘రామా లవ్స్‌ సీత’ ఇప్పటి వరకు నేను చేసిన సాంగ్స్‌లో మోస్ట్‌ ఫేవరేట్‌. 800 మంది డ్యాన్సర్స్‌తో చాలా గ్రాండ్‌గా పిక్చరైజ్‌ చేశారు. కంప్లీట్‌గా అటు డ్యాన్స్‌, కామెడీ పర్ఫామ్‌ చేయడానికి మంచి స్కోప్‌ ఉన్న ‘వినయ విధేయ రామ’ చేసినందుకు చాలా హ్యాపీ. రామ్‌ చరణ్‌ ఇంస్టాగ్రామ్‌ అంటే చాలా ఇష్టం. ఆయనకీ సీక్రెట్‌ ఇంస్టాగ్రామ్‌ అకౌంట్‌ కూడా ఉంది. కానీ చాలా మందికి ఆ విషయం తెలీదు.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్‌ గురించి?
నా క్యారెక్టర్‌ వచ్చేసి ‘సీత’. ఫ్యామిలీలో అందరి ముందు చాలా వినయంగా ఉంటూ, రామ్‌ ఏది చెప్తే అదీ అన్నట్టుగా ఉంటాను. బయట మాత్రం చాలా డామినేటింగ్‌గా ఉంటాను. మా కాంబినేషన్‌ లో ఉండే సీన్స్‌ ఇంట్రెస్టింగ్‌ గా ఉంటాయి. సినిమాలో మా కెమిస్ట్రీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

దానయ్య డి.వి.వి గారి ప్రొడక్షన్‌ వాల్యూస్‌?
‘భరత్‌ అనే నేను’ సినిమాకి నమ్రతా గారు అప్రోచ్‌ అవ్వడం జరిగింది. నమ్రతా చాలా నైస్‌ పర్సన్‌. ‘భరత్‌ అనే నేను’ సినిమా చేస్తున్నప్పుడే దానయ్య గారు ‘వినయ విధేయ రామ’లో కూడా అవకాశం ఇచ్చారు. ఎలాగైనా చేయాలనుకున్నా. అలా దానయ్య గారితో రెండో సారి పని చేసే అవకాశం దక్కింది. దానయ్య గారు గ్రేట్‌ స్క్రిప్ట్‌నే ఎంచుకుంటారు. చాలా లవ్‌లీ ప్రొడ్యూసర్‌. ఫ్యూచర్ లో దానయ్య గారి బ్యానర్‌లో మరిన్ని సినిమాలు చేస్తాను.

ఫ్యూచర్‌లో ఎలాంటి మూవీస్‌ చేయాలనుకుంటున్నారు?
నాకైతే పర్టికులర్‌గా ఒకే లాంగ్వేజ్‌ ఆడియెన్స్‌కి స్టిక్‌ అవ్వాలనే ఆలోచన లేదు. గ్లోబల్‌ ఆడియెన్స్‌ ని ఎంటర్‌ టైన్‌ చేయాలి. లాంగ్వేజ్‌ ఏదైనా, స్క్రిప్ట్‌ బావుంటే అది డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ అయినా ‘నో’ అని చెప్పను.

అర్జున్‌ రెడ్డి రీమేక్‌లో నటించడం ఎలా అనిపిస్తోంది?
అర్జున్‌ రెడ్డి రీమేక్‌లో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. సినిమాలో లాస్ట్‌ సీన్‌ నుండి షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. సినిమాలో నేటివిటీకి తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్‌ చేశారు. సినిమా ఢిల్లీ బ్యాక్‌ డ్రాప్‌లో ఉంటుంది.

Kiara Advani – Pics