మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి , అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ అంతరిక్షం 9000 KMPH ‘..ఈ చిత్రం ట్రైలర్ ని డిసెంబర్ 9 న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.. కాగా ఈ ట్రైలర్ లాంచ్ వేడుకను AMB సినిమాస్ మల్టీప్లెక్స్ లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు..సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా దసరా సందర్భంగా విడుదల అయిన టీజర్ కి విశేష స్పందన లభించింది.. ఇటీవలే విడుదల అయిన పాటకు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.. ప్రశాంత్ విహారి సంగీతం సమకూరుస్తుండగా జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా సినిమా విడుదల కాబోతుంది..

నటీనటులు: వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు: సంకల్ప్ రెడ్డి
నిర్మాతలు : రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్), సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి యెడుగూరు
బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
ఎడిటర్ : కార్తిక్ శ్రీనివాస్
డీఓపీ : జ్ఞాన శేఖర్ VS(బాబా)
సంగీతం: ప్రశాంతి విహారీ
ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ & మోనికా నిగొత్రే సబ్బాని
సిజీ : రాజీవ్ రాజశేఖరన్
PRO: వంశీ-శేఖర్