రివ్యూ : విశాల్ ‘పందెం కోడి 2’ కూడా విన్

0
545

ఇండస్ట్రీహిట్ .కామ్ రేటింగ్ 3.25/5
బ్యానర్ : విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, లైట్ హౌస్ మూవీ మేకర్స్ యల్ యల్ పి., పెన్ స్టూడియోస్, లైకా ప్రొడక్షన్స్,
నటీనటులు : విశాల్, కీర్తి సురేష్ , వరలక్ష్మి శరత్ కుమార్ , రాజ్ కిరణ్, అర్జై , గంజ కరుప్పు , రామ్ దాస్ తదితరులు.
సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా,
ఎడిటర్ : కె ఎల్ ప్రవీణ్,
సమర్పణ : ఠాగూర్ మధు,
నిర్మాతలు: విశాల్ ధవళ్ జయంతలాల్ గడ, ఆకాష్ జయంతలాల్ గడ,
దర్శకత్వం,స్క్రీన్ ప్లే : ఎన్ లింగుస్వామి
విడుదల తేదీ :18.10.2018

`పందెంకోడి` అంటే గుర్తుకు వ‌చ్చేది హీరో విశాల్‌. సినిమా కెరీర్‌కే చాలా పెద్ద బ్రేక్ ఇచ్చిన మూవీ అది. ఆ సినిమా టైటిల్ అంతగా ఓన్ చేసుకున్నాడు విశాల్. పందెంకోడి విడుదలయ్యిన ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత ఆ సినిమాకు సీక్వెల్ పందెంకోడి 2 విడుద‌ల‌వుతుందంటే ఎన్ని అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పైగా విశాల్ కి ఇది 25వ చిత్రం. మాస్ చిత్రాల డైరెక్టర్ లింగు సామీ దర్శకత్వం లో నిర్మాత ఠాగూర్ మధు నిర్మించిన `పందెంకోడి 2` ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌లైంది. మ‌రి పార్ట్ వ‌న్‌ను మించి ఈ సీక్వెల్ భారీ అంచ‌నాలతో దసరా కానుకగా విడుదల అయ్యింది.

క‌థ‌:
రాజారెడ్డి(రాజ్‌కిర‌ణ్‌) స‌హా ఏడు గ్రామాల ప్ర‌జ‌లు కుల‌దైవంగా వీర‌భ‌ద్రుడిని కొలుస్తుంటారు. ప్రతి ఏటా ఆ ఏడు ఊర్లు కలిసి జరుపుకున్నే వీరభద్ర జాతరలో భోజనాల దగ్గర జరిగిన ఓ చిన్నపాటి గొడవలో ఓ రెండు కుటుంబాల మధ్య పగ పెరుగుతుంది. దాంతో ఆ రెండు కుంటుంబాల్లోని ఒక కుటుంబం అయిన భవాని (వరలక్ష్మి శరత్ కుమార్) మనుషులు, ఆవతలి కుటుంబంలోని మనుషులందర్నీ చంపేస్తారు. ఆ గొడ‌వ‌ల్లో భ‌వాని భ‌ర్త‌ను చంపేస్తారు. అందుకు ప్ర‌తిగా భ‌వాని మ‌నుషులు కూడా ప్ర‌త్యర్థి వ‌ర్గానికి చెందిన వాళ్లంద‌రినీ చంపేస్తారు. వారందరిలో ఓ కుర్రాడు మాత్రం మిగిలిపోతాడు. ఆ తరువాత జాత‌ర‌ను ఏడేళ్లుగా జర‌పుకోరు. అన్ని ఊళ్ల జ‌నాల కోసం రాజారెడ్డి మ‌ళ్లీ జాత‌ర‌ను చేయాల‌నుకుంటాడు. అదే స‌మ‌యంలో భ‌వాని మ‌నుషులు ఆ కుర్రాడిని చేంపేయాల‌నుకుంటారు. రాజారెడ్డి ఆ కుర్రాడిని కాపాడతాన‌ని మాటిస్తాడు. ఇదిలావుండగా ఏడేళ్లుగా విదేశాల్లో ఉంటున్న రాజారెడ్డి కొడుకు బాలు(విశాల్‌) వాళ్ళ గ్రామానికి వొస్తాడు. అక్క‌డ చారుల‌త‌(కీర్తిసురేశ్‌)ని చూసి ప్రేమిస్తాడు. ఏడు రోజుల పాటు జ‌రిగే జాత‌ర్లో భ‌వానీ మ‌నుషుల నుండి రాజారెడ్డి, బాలు ఆ కుర్రాడిని ఎలా కాపాడార‌నేదే మిగతా కథ.

నటి నటుల పెర్ఫార్మన్స్:
కథాపరంగా రాయలసీమకు చెందిన ఓ పవర్ ఫుల్ కుర్రాడి పాత్రలో నటించిన విశాల్, ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను కనపర్చడం చాలా బాగుంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో, చాలా సహజంగా నటిస్తూ సినిమాకి హైలెట్ గా నిలచాడు. అల్లరి అమ్మాయి అయిన చారుమతి పాత్రలో నటించిన హీరోయిన్ కీర్తీ సురేష్ తన గ్లామర్ తో పాటు, తన ఇన్నోసెంట్ పెర్ఫార్మన్స్ తో.. అచ్చం ఓ పల్లెటూరి అమ్మాయిగా, ఎవరికీ భయపడని చలాకీ అమ్మాయిలా చాలా బాగా నటించింది. హీరోకి తండ్రి పాత్రలో నటించిన రాజ్ కిరణ్ ఎప్పటిలాగే తన గంభీరమైన నటనతో ఆకట్టుకున్నారు. ఏడు ఊరులకు పెద్దగా.. ఎలాంటి గొడవలు జరగకుండా తాపత్రయపడే ఓ నాయకుడిగా ఆయన చాలా బాగా నటించారు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆయన నటన చాలా ఎమోషనల్ గానూ ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పగతో రగిలిపోయే ఆడదానిలా.. శత్రువు వంశంలో ఎవ్వర్ని బతకనివ్వకూడదని పట్టు బట్టిన అమ్మాయి పాత్రలో ఆమె నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణలా నిలుస్తోంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

సాంకేతిక వర్గం :
పందెంకోడి పార్ట్ వ‌న్‌ని కాస్త సిటీలో.. ఈ సారి ప‌ల్లెటూరి వాతావరణం లో ద‌ర్శ‌కుడు లింగుస్వామి పార్ట్‌ ౨ ను మాత్రం విలేజ్‌లోనే తెర‌కెక్కించాడు. ఓ భారీ సెట్ వేసి అందులో చిత్రీక‌ర‌ణంతా పూర్తి చేశాడు.తండ్రిని కాపాడుకునే ప్ర‌య‌త్నంలో విశాల్ ఎలాంటి ప‌నులు చేస్తాడు. అదే స‌మ‌యంతో తండ్రి ఇచ్చిన మాట కోసం విల‌న్స్ బారి నుండి త‌న‌కు కావాల్సిన కుర్రాడిని ఎలా కాపాడుకుంటాడ‌నేది యాక్ష‌న్ పార్ట్‌తో ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు. దర్శకుడు కొన్ని సన్నివేశాలను ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన కథా కథనాలని రాసుకోలేకపోయారు. ఆయన అందించిన పాటలు మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నే విధంగా లేవు. శక్తివెల్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా పల్లెటూరి విజువల్స్ ను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. కె ఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ బాగుంది. యువన్‌ శంకర్‌ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాట‌ల్లో రెండు పాట‌లు బావున్నాయి. తెలుగులో డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

విశ్లేష‌ణ‌:
పందెం కోడి 2 కథాపరంగా చూస్తే గతం లో వచ్చిన రెండు గ్రామాల మధ్య వుండే కక్ష ప్రతీకారాలతో వుండే రొటీన్ కథ అయినా… దర్శకుడు లింగు సామి తెరకెక్కిన విధానం అద్భుతంగా వుంది ‘పందెంకోడి 2’ చిత్రంలో కొన్ని మెప్పించే అంశాలు ఉన్నప్పటికీ, ముఖ్యమైన కథనం నెమ్మదిగా సాగడం, సినిమాలో మెయిన్ థీమ్ కు తగట్లు ట్రీట్మెంట్ లేకపోవడం వంటి అంశాలు సినిమాకు బలహీనతలుగా నిలుస్తాయి. అయితే, హీరోహీరోయిన్ల మధ్య కొన్ని ప్రేమ సన్నివేశాలు మరియు విశాల్ కి అతని తండ్రికి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

తీర్పు:
ఓవరాల్ గా ఈ చిత్రం బీ. సీ సెంటర్ ప్రేక్షకులను..బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పల్లెటూరి ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ఎమోష‌న‌ల్‌గా సాగే ఇంట‌ర్వెల్ ఫైట్‌.. ఇక క్లైమాక్స్‌లో విశాల్‌, వ‌ర‌ల‌క్ష్మి మ‌ధ్య జ‌రిగే ఫైట్ ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయ‌న‌డంలో, పందెంకోడి పార్ట్ 1 లాగే పార్ట్ 2 కూడా ఆదరిస్తారనడంలో సందేహం లేదు. ఈ సక్సెస్ తో పందెం కోడి 3 కూడా రావచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here