మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్ రాజా, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్‌గుడ్ ఫిలింస్ చిరంజీవి 153వ చిత్రం మ్యాజిక్ సిట్టింగ్స్ మొద‌లు

0
339

మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రం `ఆచార్య` విడుదల‌కి సిద్దంగా ఉంది. దాంతో పాటు చిరంజీవి  పైప్‌లైన్‌లో కొన్ని ఎగ్జ‌యిటింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి తన 153 వ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజాతో చేయ‌నున్న విష‌యం తెలిసిందే..మెగాస్టార్ లాంటి బిగ్‌స్టార్‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజాకి డ్రీమ్ క‌మ్ ట్రూ మూమెంట్‌.

ఈ చిత్రంకోసం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఈ రోజు నుండి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ రాజా, ఎస్ ఎస్ తమన్ కలిసి ఉన్న పోస్టర్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

చిరంజీవి  మాస్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ద‌ర్శ‌కుడు మోహ‌న్‌రాజా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ని జోడించారు. ఈ విష‌యంలో చిరంజీవి కూడా సంతృప్తి చెందిన‌ట్టు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్‌గుడ్ ఫిలింస్ ప‌తాకాలు సంయుక్తంగా నిర్మిస్తున్నమెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రానికి ఆర్ బి చౌద‌రి మ‌రియు ఎన్వీ ప్ర‌సాద్ నిర్మాత‌లు.

మెగాస్టార్ ఆచార్య చిత్రం షూటింగ్ పూర్త‌వ‌గానే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది.

తారాగ‌ణం: చిరంజీవి

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: మోహ‌న్ రాజా
నిర్మాత‌లు: ఆర్ బి చౌద‌రి, ఎన్వీ ప్ర‌సాద్
బ్యాన‌ర్‌: కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, సూప‌ర్‌గుడ్ ఫిలింస్‌
సంగీతం: త‌మ‌న్ ఎస్ ఎస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here