రెబల్ స్టార్ ప్రభాస్ – ఎస్ ఎస్ రాజమౌళి ల బ్లాక్ బస్టర్ ‘బాహుబలి’ ప్రభంజనానికి ఐదేళ్లు…..!!

0
579
5 years for epic baahubali

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన అత్యద్భుత దృశ్య కావ్యం బాహుబలి మొదటి భాగం సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున రిలీజ్ అయి మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా ఎంతో పెద్ద ప్రభంజనాన్ని సృష్టించి,దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. స్వీటీ అనుష్క, తమన్నా భాటియా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించగా ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో అత్యంత భారీ ఖర్చుతో నిర్మించారు.

ఒకరకంగా తెలుగు సినిమా ప్రభంజనం గురించి మాట్లాడుకోవాలి అంటే, బాహుబలికి ముందు, అలానే బాహుబలికి తరువాత అని చెప్తుంటారు సినీ విశ్లేషకులు. ప్రభాస్ సహా సినిమాలోని మిగతా నటులందరి సహజత్వ నటన, భారీ సెట్టింగులు, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, ఆకట్టుకునే కథ, కథనాలు, రాజమౌళి మార్క్ టేకింగ్, సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి ఈ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణాలు. ఇకపోతే అత్యద్భుత దృశ్య కావ్యం బాహుబలి సినిమా రిలీజ్ అయి నేటితో సక్సెస్ఫుల్ గా ఐదేళ్లు పూర్తి చేసుకోవడంతో పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు సినిమా యూనిట్ కు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here