కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ నేపద్యంలో మిగతా రంగాల తో పాటు సినిమా రంగం కూడా మూతపడడం, పలు సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో స్టార్స్ అందరూ కూడా తమ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. కాగా ఇటువంటి సమయంలో పనుల్లేక, తినడానికి తిండి లేక ఎందరో రోజు వారీ సినిమా వర్కర్లు పడుతున్న అవస్థను గమనించి ఇటీవల టాలీవుడ్ ప్రముఖులతో కరోనా విపత్తు నిధి పేరిట ఒక సంస్థను నెలకొల్పి, తాను సహా పలువురి నుండి విరాళాలు సేకరించి, తద్వారా నిత్యం ఎందరో కార్మికులకు భోజనం, సరుకులు అందిస్తున్నారు మెగాస్టార్.
ఇకపోతే కాసేపటి క్రితం నేడు ఆదివారం కావడంతో, తన తల్లి, తమ్ముళ్లు, అక్క, చెల్లళ్లతో కలిసి గతంలో ఒక సందర్భంలో దిగిన ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఈ లాక్ డౌన్ సమయంలో వారందరినీ మిస్ అవుతున్నాను, అతి త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడి మనం అందరం మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను అంటూ ఒక పోస్ట్ చేశారు. కాగా ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది…..!!



