మాస్ మహా రాజ్ వీరాభిమాని గా “కొంటె కుర్రాడు”

0
629
Konte Kurraadu Movie

ఎస్ ఎమ్ ఫోర్ ఫిలిమ్స్,బ్యానర్ లో రవి తేజ అభిమాని ఎమ్.ఎన్. వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తు నిర్మిస్తున్న చిత్రం “కొంటె కుర్రాడు” ఓ లోఫర్ గాడి ప్రేమ కథ అనేది “ఉపశీర్షిక” మాస్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో “గాయత్రి పటేల్” హీరోయిన్ గా నటిస్తుంది, మాస్ మహా రాజ్ సినిమా టైటిల్స్ తో ఎస్ ఎ అరమాన్ రచించి కంపోజ్ చేయగా ప్రముఖ సింగర్ రాంకీ పాడిన “కొంటె కుర్రాడు” టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో ట్రేడింగ్ లో ఉంది, రెండు మనసులు కలిసుండటం ఇష్టం లేక రెండు కుటుంబాలు చేస్తున్న యుద్ధమే ఈ ప్రేమకథ అనే కధాంశం తో రూపొందుతున్న ఈ చిత్రం హైదరాబాద్ రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంది, క్లైమాక్స్ ఉహాలకందని ట్విస్టులతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది, ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని దర్శకుడు “ఎమ్ ఎన్ వి సాగర్” అన్నారు ఈ సినిమా లో అన్ని పాటలు కధకనుగుణంగా మంచి ట్యూన్స్ కుదిరాయి ఈ సినిమా తో నాకు మంచి పేరు వస్తుంది అని సంగీత దర్శకుడు “ఎస్ ఎ అరమాన్” అన్నారు, ఈ చిత్రానికి “కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, ఎమ్ ఎన్ వి సాగర్”,
“డి ఓ పి, సి ఎస్ చంద్ర”,
“ఎడిటింగ్, మహేష్”
“సంగీతం, ఎస్ ఎ అరమాన్,”
“విజువల్ ఎఫెక్ట్స్, నాగరాజు సప్ప”,
“పబ్లిసిటీ డిజైనర్, కిశోర్ బాబు,
“కో.ప్రొడ్యూసర్ ప్రవీణ్ కుమార్”,
“కాస్టింగ్, సాయి ప్రసాద్”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here