అక్కినేని యువ హీరో అఖిల్ ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ తో తన నాలుగవ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. పూజా హెగ్డేని హీరోయిన్ గా ఫైనల్ చేసిన చిత్ర యూనిట్ కథానాయికకు సంబందించిన ఎపిసోడ్స్ ని యమ స్పీడ్ గా షూట్ చేస్తోంది.
కోర్టు బ్యాక్ డ్రాప్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఈ షెడ్యూల్ లో హీరో అఖిల్ తో పాటు కథానాయిక పూజా హెగ్డే అలాగే రఘుబాబు – కాశి విశ్వనాథ్ లు షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నారు. ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా సాగే ఈ సినిమాలో అఖిల్ సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.


