రాఘవ లారెన్స్‌ డబుల్‌ మాస్‌ ‘కాంచన 3’

0
672

ఓ పాడుబడ్డ బిల్డింగ్‌.. అందులో ఓ చరిత్ర.. కొన్ని సంవత్సరాల తరువాత ఆ బిల్డింగ్‌లోకి కొందరు వెళ్ళడం .. వారికి దెయ్యాలు కనిపించడం.. అక్కడికి వచ్చిన వారికి ఆ దెయ్యాలు తమ బాధలు చెప్పుకోవడం.. అవి అనుకున్న కోరికలు తీర్చుకోవడం.. ఇవి చెప్పగానే మనకు టక్కున  ఈ సీన్స్‌ అన్నీ రాఘవ లారెన్స్‌ సినిమాలో ఉంటాయని గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు హాలీవుడ్‌లో మాత్రమే ఇలాంటి హర్రర్‌ సినిమాలు వచ్చేవి. బాలీవుడ్‌లో వచ్చినా ఆకట్టుకోలేవు. కానీ దక్షిణాది సినీలోకం మాత్రం హర్రర్‌ సినిమాలతో పిచ్చ థ్రిల్‌నిస్తోంది. కథలో డెప్త్‌ ఉంటే తప్ప సినిమాలు తీయని లారెన్స్‌ తీసిన హర్రర్‌ సినిమాలన్నీ హిట్టయ్యాయి.

హైప్‌ టెర్రర్‌, సస్పెన్స్‌తో..

‘ముని’ సినిమా నుంచి హర్రర్‌ సినిమాలని మొదలుపెట్టిన లారెన్స్‌ ఆ తరువాత ఆయన తీస్తున్న సినిమాలు దాదాపు విజయంవైపే దూసుకెళ్తున్నాయి. ‘ముని’కి సిరీస్‌గా వచ్చిన ‘కాంచన’, ‘గంగ’ సినిమాలు కూడా లారెన్స్‌కు పేరు తెచ్చాయి. ఇప్పుడు అదే ఊపులో ‘కాంచన్‌-3(ముని-4) ‘ పేరుతో మరో హర్రర్‌ సినిమాతో శుక్రవారం థియేటర్లోకి వస్తున్నాడు. హైప్‌ టెర్రర్‌, సస్పెన్స్‌తో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదలయై లారెన్స్‌ అభిమానులతో పాటు హర్రర్‌ సినిమా ప్రేక్షకులను ఇదివరకే ఆకట్టుకుంది. దీంతో రేపటి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

క్యారెక్టర్లు అవే.. కథే కొత్తగా..

లారెన్స్‌ డైరెక్ట్‌ చేసిన ‘ముని’ వర్షన్‌ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు, ప్లేసులు ఒకే మాదిరిగా ఉంటున్నాయి. ఉదాహరణకు ‘ముని’ నుంచి ‘గంగ’ వరకు ఆయన సినిమాను ఒకే బంగ్లాను వేదికగా చేసుకొని సినిమా తీస్తున్నాడు. అలాగే ‘ముని’లో మాదిరిగానే ‘గంగ’లో బీచ్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇక క్యారెక్టర్ల విషయానికొస్తే లారెన్స్‌తో పాటు కోవైసరళ ఆయన ప్రతీ సినిమాలోనూ ఉంటోంది. ‘ముని’లో నటించిన హీరోయిన్‌ వేదిక చాలా రోజుల తరువాత మళ్లీ లారెన్స్‌ సినిమా ‘కాంచన-3’లో అలరించనుంది. ఇలా ఆయన సినిమాల్లో కొన్ని విషయాలు రిపీట్‌ చేసుకున్నా కథాంశం మాత్రం కొత్తగా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలపై సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇక గ్రాఫిక్స్‌, మ్యూజిక్‌తో లారెన్స్‌ వణుకు పుట్టిస్తాడని నమ్మకం.

‘ముని’కి ‘కాంచన-3’ సంబంధముందా..?

లారెన్స్‌ మొదటి హర్రర్‌ సినిమా ‘ముని’ సినిమా కథ ఆ సమయంలో ఇంట్రెస్ట్‌గా ఉంది. ఓ మత్స్య కార్మికుడి కూతురిని కొందరు అత్యాచారం చేస్తారు. అదేంటని అడిగితే అతనిని ఓ బిల్డింగ్‌లో పెట్రోల్‌ పోసి కాల్చి ఆ బాడీని సముద్రంలో పడేస్తారు..అయితే ఆ ఆత్మ తిరిగి అదే బిల్డింగ్‌లోకి చేరి ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకుంటుంది. తాజాగా వస్తున్న ‘కాంచన-3’లో కూడా లారెన్స్‌ ముసలాడి వేషం చూస్తే కూడా ఏదో పల్లెటూరిలో జరిగే సంఘటన ఆధారంగానే సినిమా ఉంటుందని అర్థమవుతోంది. అందులోనూ లారెన్స్‌ చెప్పే ‘నేను డబుల్‌ మాస్‌’ అనే డైలాగ్‌ చూస్తే వయసు మీదపడిన ఓ వ్యక్తిపైనే కథ నడుచి అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక ‘ముని’ సినిమాలోని హీరోయిన్‌ వేదిక కూడా ఇందులో నటించడం… ఇవన్నీ చూస్తుంటే కాంచన 3 కి ముని 1 కి ఎమన్నా కనెక్షన్ ఉందా అనిపిస్తోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here