ఫోటో స్టొరీ: అల్లరిపిల్లగా మారిన అందాల భామ

0
84

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు కథానాయికలు అతితక్కువమంది ఉంటారనే నిజం అందరికీ తెలిసిందే. కారణాలేవైనా ఇక్కడ ఉత్తరాది భామల హవా సాగుతుంది.. వాళ్ళేమైనా అవకాశాలు మిగిలిస్తే మలయాళ.. తమిళ.. కన్నడ భామలు వాటిని అందిపుచ్చుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈషా రెబ్బా లాంటి అచ్చతెలుగు భామలు మాత్రం ఊరికే నెపోటిజం అని.. నార్త్ భామల డామినేషన్ అని హంగామా చేయకుండా తమపని తాము చేసుకుంటూనే హీరోయిన్ గా తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

నటన.. గ్లామర్ విషయంలోనే కాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విషయంలో కూడా ఈషా ముంబై బ్యూటీలకు ఏమాత్రం తీసిపోదు. ముఖ్యంగా ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా నిత్యం అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఈషా ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో కొలేజ్ లాంటిది తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ కొలేజ్ లో మొత్తం ఎనిమిది ఫోటోలున్నాయి. ఎనిమిది ఫోటోలలో ఎనిమిదిరకాల హావభావాలతో అల్లరి చేస్తూ పోజులిచ్చింది. ఒక ఫోటోలో బుగ్గపై వేళ్ళు పెట్టుకుని నవ్వింది. మరో ఫోటోలో ఫ్లయింగ్ కిస్ ఇస్తోంది. ఇంకో ఫోటోలో నాలిక బైటపెట్టి వెక్కిరిస్తోంది. ఇలా రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో అల్లరిపిల్లగా మారిపోయింది.

నిజానికి ఇలాంటి డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో కూడిన కొలేజ్ సమంతా ట్విట్టర్ ఖాతాలో ‘హెడర్ ఫోటో’లో ఉంటుంది. సమంతా కూడా ఇలాంటి అల్లరి ఎక్స్ ప్రెషన్స్ పెట్టి అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. మరి ఈషా కూడా సామ్ ను ఫాలో అయిందేమో మనకు తెలీదు. దాని సంగతేమో కానీ ఈ పోస్ట్ కు ఈషా ఇచ్చిన క్యాప్షన్ “జస్ట్ బీ యువర్ సెల్ఫ్”.. అంటే ఏం లేదు.. “మీలాగే మీరుండండి” అని అర్థం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here