ఒకవైపు క్రికెట్… మరోవైపు హర్రర్

0
8

ఎన్నికల సమయంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఉండే సినిమాలు రావడం, దేశంలో బాగా పాపురైనా రాజకీయాల నాయకులకు సంబంధించిన బయోపిక్ లు తెరపై ఆవిష్కరించబడం వంటివి కామన్ గా జరుగుతుంటాయి. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వేవ్ ను చూసి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా వచ్చిన చాలా సినిమాలు క్యాష్ చేసుకున్నాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటు పొట్టి ఫార్ములా క్రికెట్ హడావుడి కూడా నడుస్తోంది. సామాన్యులకు ఎన్నికలపైనే, యువతకు క్రికెట్ పైన మక్కువ ఉంటుంది. వీరిద్దరికి కామన్ నచ్చేవి సినిమాలే. ఈ టైమ్ లో క్రికెట్ కు సంబంధించిన సినిమా వచ్చింది అంటే దానికి ఆదరణ ఉంటుంది. ట్రైలర్ చూపినట్టు హీరో ధోనిలా రెచ్చిపోయి ఆడార్రా. తప్పకుండా చూడాలి అనుకోని సినిమాకు వెళ్లేవాళ్లు సంఖ్యా ఎక్కువగా ఉంటుంది. అభిమాన హీరో పైగా క్రికెట్ సినిమా అంటే క్యూ కడతారు. సినిమా బాగుంది అనే టాక్ వచ్చిందా కనకవర్షం కురుస్తుంది. రీసెంట్ గా వచ్చిన మజిలీ కూడా క్రికెట్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో వచ్చిందే. దానిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో చూశాం కదా.

ఇప్పుడు నాని హీరోగా చేస్తున్న జెర్సీ సినిమా కూడా ఆ కోవలో సినిమానే. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. లేటు వయసులో ఘాటు ప్రేమలో పడిన వ్యక్తులను చూశాం కానీ, క్రికెట్ లో రిటైర్ అయ్యే వయసులో బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి దిగి క్రికెటర్ గా రాణించడం అంటే చాలా పెద్ద విషయం. ఇలాంటి విషయాన్ని హీరో నాని సుసాధ్యం చేసి చూపించాడు. అదెలా సాధ్యం అయ్యింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాకు పోటీగా ముని ప్రాంఛైసిలోని నాలుగో సినిమా వస్తున్న కాంచన 3 పోటీ పడుతోంది. ఒరిజినల్ తమిళం అయినప్పటికీ రాఘవ లారెన్స్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. దీంతో లారెన్స్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. ముని, కాంచన సినిమాలు ఇక్కడ కూడా పెద్ద హిట్ అయ్యాయి. దెయ్యం కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా కావడంతో కాంచన 3 పై అంచనాలు ఉన్నాయి. పైగా ఇందులో దెయ్యాన్ని సమ్ థింగ్ స్పెషల్ గా చూపించబోతున్నాడు. అంతేకాదు, రాఘవ లారెన్స్ సాల్ట్ & పెప్పర్ గడ్డంతో నడివయసు వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అటు జెర్సీ, ఇటు కాంచన 3 లు శుక్రవారం రోజున సందడి చేయబోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here