ఓ సితార.. సితార.. సితార.. ఓ సితార‌… నిన్న‌మొన్న నేను ఆవారా..!
ఓ సితార‌.. సితార.. సితార.. ఓ సితార‌.. ప్రేమ పంచుకోవె మ‌న‌సారా..!!

సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా దిల్లీ బ్యూటీ ర‌కూల్‌తో పాడుకున్న డ్యూయెట్ ఇది. ఎస్.ఎస్‌.థ‌మ‌న్ సంగీతం అందించాడు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సింగిల్‌ రిలీజైంది. `నీలాంటోడు అడుగడుగునా ఉంటారు. నాలాంటోడు అరుదుగా ఉంటాడు.. అంటూ సాయిధ‌ర‌మ్ ట్రైల‌ర్‌తో ఆక‌ట్టుకున్నాడు. గుర్ర‌పు పందేలు ఆడే కుర్రాడి ఛాలెంజ్ ఏంట‌నేది తెర‌పైనే చూడాలి అన్న క్యూరియాసిటీని పెంచింది ట్రైల‌ర్‌. ఇప్పుడు ఈ పాట సంథింగ్ స్పెష‌ల్‌గా ఆక‌ట్టుకుంటోంది. యాజిన్- సంజ‌న ఈ గీతాన్ని ఆల‌పించారు. అనంత శ్రీ‌రామ్ లిరిక్స్ అందించారు. ఈ పాట‌కు రాజు సుంద‌రం కొరియోగ్ర‌ఫీ అందించారు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు.