ఫిబ్రవరి 5 న “స్వచ్ఛ్ హైదరాబాద్” క్రికెట్ మ్యాచ్ !!  

0
328

GHMC తో కలిసి.. స్టార్స్  అండ్ క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్.. ఫిబ్రవరి 5 న- ఎల్.బి.స్టేడియంలో.. “స్వచ్ఛ్ హైదరాబాద్”  క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తోంది. ఇందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సహకరిస్తోంది.
కార్పొరేటర్స్ తరపున.. మహిళా జట్టుకు గద్వాల్ విజయలక్ష్మి (స్టాండింగ్ కమిటీ మెంబర్ మరియు బంజారాహిల్స్ కార్పొరేటర్),  ఐ.ఎస్.సదన్ కార్పొరేటర్ స్వప్న నాయకత్వం వహిస్తుండగా.. లేడీస్ స్టార్ టీమ్ కు హీరోయిన్ సంజన  సారధ్యం వహిస్తారు. పూనమ్ కౌర్. అక్ష, షామిలి, స్వాతి దీక్షిత్, మాధవీలత, ప్రశాంతి, అలేఖ్య తదితరులు ఈ టీమ్ లో ఉంటారు.
ఇక మేల్ స్టార్స్ టీమ్ కు.. కెప్టెన్ గా హీరో శ్రీకాంత్. వైస్ కెప్టెన్ గా కపిల్ రాజ్ బాధ్యతలు చేపడుతుండగా.. సుధీర్ బాబు, తరుణ్, నిఖిల్, ప్రిన్స్, శ్రీధర్ రావ్, షాని సభ్యులుగా ఉన్నారు. మేల్ కార్పొరేటర్స్ జట్టును.. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్,

జి.హెచ్.ఎం.సి స్టాండింగ్ కమిటీ మెంబర్ అండ్ రామ్ నగర్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి (వి.ఎస్.ఆర్) నడిపిస్తారు.
ఫిబ్రవరి 5న.. ఎల్.బి.స్టేడియంలో అత్యంత కోలాహలంగా.. అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో.. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, సినీ మరియు క్రీడా ప్రముఖులు పాలుపంచుకోనున్నారని Stars & Kricket Entertainment Founder & Chairman అభినవ్ సర్దార్ పటేల్, Co-Founder శ్రీధర్ రావు తెలిపారు.
ఈ వివరాలు తెలిపేందుకు ప్రొడ్యూసర్ హాల్ లో జరిగిన మీడియా సమావేశంలో హీరోలు సుధీర్ బాబు, తరుణ్, లోహిత్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శివాజీ రాజా, శ్రీనివాస్, షోని సోలొమన్,  హీరోయిన్స్ మాధవీలత, అలేఖ్య, ప్రశాంతి, షామిలి, అభినవ్ సర్దార్, శ్రీధర్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శివాజీ రాజా మాట్లాడుతూ.. “సినీ స్టార్స్ పేవరెట్ స్పోర్ట్ క్రికెట్. ప్రజల్లో పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ పట్ల మరింత అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న ఈ క్రికెట్ మ్యాచ్ ను విజయవంతం చేసేందుకు “మా” (మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ పూర్తి స్థాయిలో సహకరిస్తుంది” అన్నారు.
హీరో తరుణ్ మాట్లాడుతూ.. “మన ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో.. మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవడం అవసరం. ఒక మంచి “కాజ్” కోసం ఫిబ్రవరి 5న ఆడుతున్న ఈ మ్యాచ్ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది” అన్నారు.
హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. “ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటప్పుడు ప్రోత్సహించడం, పాల్గొనడం ప్రతి యాక్టర్ బాధ్యతని నేను భావిస్తాను. అయితే ఈ మ్యాచ్ ను ఏదో ఉత్తుత్తిగా ఆడకుండా.. చాలా సీరియస్ గా ఆడబోతున్నాం” అన్నారు.
స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు ప్రముఖ నటుడు లోహిత్ మాట్లాడుతూ.. “స్టార్స్ తో క్రికెట్ ఆడేందుకు కార్పొరేటర్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలా ఎగ్జయిట్ కూడా అవుతున్నారు. కార్పొరేటర్స్ గా వారు పదవీ బాధ్యతలు స్వీకరించి ఫిబ్రవరి 5కి సంవత్సరం పూర్తి కావస్తున్న సందర్బంగా ఈ మ్యాచ్ ఆడుతున్నందుకు వారు చాలా సరదా పడుతున్నారు. చాలా సీరియస్ గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు” అన్నారు.
స్టార్స్ అండ్ క్రికెట్ ఎంటర్ టైన్ మెంట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అభినవ్ సర్దార్, కో ఫౌండర్ శ్రీధర్ రావు మాట్లాడుతూ.. “ఈ కార్యక్రమ నిర్వహణకు మేయర్ బొంతు రామ్మోహన్, కమీషనర్ బి.జనార్దన్ రెడ్డి, “మా”  అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివాజీరాజా ఎంతో కోపరేట్ చేస్తున్నారు. అలాగే ఎన్నో సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పలు విధాలా సహాయ సహాయ సహకారాలు అందిస్తున్నాయి” అన్నారు.
“సాధారణంగా ఆడపిల్లల్ని క్రికెట్ కి దూరంగా ఉంచుతారు. మేమూ అలాగే పెరిగాం. కానీ ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ లో మమ్మల్ని ఆడిస్తుండడం ఎంతో సంతోషాన్నిస్తోంది” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు హీరోయిన్స్ మాధవీ లత, ప్రశాంతి, అలేఖ్య, షామిలి.
ఫిబ్రవరి 5న, హైదరాబాద్, ఎల్.బి.స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రసమయి బాల కిషన్ సారధ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ మ్యాచ్ మొదలవుతుంది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here