శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులను కలిసి వారికి అందచేస్తున్న ప్రసాదాల గురించి తెలుసుకున్న అదనపు ఈఓ వెంకయ్య చౌదరి

0
7
Additional EO Sri Venkayya Chowdary Enquired About The Prasadam
Additional EO Sri Venkayya Chowdary Enquired About The Prasadam

పత్రికా ప్రకటన

తిరుమల, 19 సెప్టెంబరు 2026: ఈ రోజు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన ఈ శనివారం ఉదయం తిరుమలలో జరిగిన మోహినీ అవతార వాహన సేవ జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్ఓ) శ్రీ కెవి మురళీకృష్ణ, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, ఇతర అధికారులు అక్కడ కొన్ని గ్యాలరీలలో భక్తులను కలిసి వారి సౌకర్యాల గురించి, ఆహార పానీయాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. వారికి అందచేస్తున్న ప్రసాదాలను వెంకయ్య చౌదరి గారు రుచి చూసి భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకే నేరుగా చెప్పవచ్చు అని తెలియచేయగా, వారు అటువంటి అసౌకర్యాలు ఏమి లేవు అని, అందరూ సౌకర్యంగా ఉన్నారు అని చెప్పడంతో వారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శ్రీ కనుమూరి బాపిరాజు గారు ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ బి శ్రీధర్ వర్మని కలిసి, ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందించడమే కాకుండా, తమ ఆనందాన్ని వ్యక్తం చేసి, భవిష్యత్తులో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దీనికి ప్రతిగా ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆరోగ్యంగా ఉండాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ముందుముందు మీ విలువైన సలహాలు, సూచనలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 19వ వార్డు టిడిపి కార్యకర్తలు పెంచలయ్య, మణికంఠ, అయ్యప్ప అలాగే తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here