‘మైసా’ కోసం నా లైఫ్‌నే ఇచ్చేశాను. చాలా హార్డ్ వర్క్ చేసిన సినిమా ఇది : టీజర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక మందన్న

0
5
Rashmika Mysaa Teaser Launch
Rashmika Mysaa Teaser Launch
‘మైసా’ కోసం నా లైఫ్‌నే ఇచ్చేశాను. చాలా హార్డ్ వర్క్ చేసిన సినిమా ఇది. మీకు కచ్చితంగా నచ్చుతుందని నమ్మకం ఉంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక మందన్న

రష్మిక మందన్న, రవీంద్ర పుల్లె, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పాన్ ఇండియా మూవీ ‘మైసా’ గూస్‌బంప్స్ ఇంటెన్స్ టీజర్ లాంచ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక , ఆ పాత్రలో ఒదిగిపొవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న’మైసా’ ఆకట్టుకునే ఫస్ట్ గ్లింప్స్‌తో ఇప్పటికే ఆసక్తిని రేకెత్తించింది. నవంబర్ 27, 2026న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.  తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు.

“అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను” అంటూ రష్మిక చెప్పే డైలాగ్‌తో ఆమె పాత్రలోని ఇంటెన్సిటీని పరిచయం చేశారు. భయపడని, వెనక్కి తగ్గని గిరిజన మహిళగా ఆమె పాత్ర అద్భుతంగా ఉంది. తాను ఎదుర్కొనే ఎన్నో సవాళ్లు, సామాజిక అడ్డంకులను అధిగమిస్తూ.. ప్రతి సమస్యను ఎదురించి పోరాడే ఒంటరి యోధురాలిగా మైసా కనిపిస్తుంది.  

గోండ్ గిరిజన మహిళ పాత్రలో రష్మిక ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టారు. బైక్‌ను ఎంతో ధైర్యంగా నడపడంతో పాటు.. అండర్‌వాటర్ సీక్వెన్స్‌లలోనూ సాహసోపేతమైన స్టంట్స్ చేశారు. పాత్ర కోసం రష్మిక తనను తాను పూర్తిగా మార్చుకున్న తీరు టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఇంటెన్సిటీ, రా రేజ్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. రవీంద్ర పుల్లే తన విజన్ ను స్క్రీన్‌పై అద్భుతంగా ప్రజెంట్ చేశారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా నీటి అడుగున రష్మిక కొడవలిని పట్టుకుని కూర్చున్న షాట్ హాంటింగ్‌గా ఉండటంతో పాటు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది.

సినిమాటోగ్రాఫర్ శ్రేయాస్ పి. కృష్ణ దర్శకుడి విజన్‌ను అద్భుతమైన విజువల్స్‌గా మలిచారు. జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్ స్కోర్ సినిమా డార్క్, యాక్షన్ వరల్డ్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్  కేచ రూపొందించిన యాక్షన్ బ్లాక్స్ రా, షార్ప్‌గా టాప్ క్లాస్ లో కనిపిస్తున్నాయి. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్కేల్‌ను మరింత పెంచాయి.

మొత్తంగా ‘మైసా’ టీజర్ ఒక ఇంటెన్స్, విజువల్లీ స్టన్నింగ్ యాక్షన్ డ్రామాపై అంచనాలు పెంచుతోంది. పవర్‌ఫుల్ ఫీమేల్ ప్రొటాగనిస్ట్‌గా రష్మిక చేసిన డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్, రవీంద్ర పుల్లే యాంబిషియస్ విజన్, స్పెక్టాక్యులర్ యాక్షన్, స్ట్రైకింగ్ విజువల్స్, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ‘మైసా’ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 27, 2026న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు.

https://www.youtube.com/watch?v=SORZsU6Ytp4

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకు పెర్ఫార్మెన్స్ అంటే  ఎమోషన్స్‌తో చేశాను. ఇది నాకు కొత్త టెరిటరీ. ఇంత యాక్షన్ ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఒక నెర్వస్‌నెస్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అందులో కొత్తదనం ఉండాలని నేను ఫీల్ అవుతాను. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాలో ఎమోషనల్‌గా ఏముంటుందో అంతా ఆ ఫిల్మ్‌లో ఇచ్చాను. ‘మైసా’ కోసం నా లైఫ్‌నే ఇచ్చేశాను. డైరెక్టర్ గారు నాతో చాలా రిస్కీ స్టంట్స్ చేయించారు. కథ అద్భుతంగా అనిపించింది. కానీ అదే ఇమాజినేషన్‌ను రియల్‌గా చేయాలంటే ఎంత కష్టమో అర్థమైంది. కేరళలో దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో చేశాం. కొండపైకి రియల్‌గా పరిగెత్తుకుంటూ వెళ్లమని డైరెక్టర్ గారు చెప్పేవారు. వాటర్‌ఫాల్స్ నుంచి దూకమని చెప్పేవారు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ షూటింగ్‌కి వెళ్లాలంటే వణుకు పుట్టింది. అండర్‌వాటర్ సీక్వెన్స్ ఉంది. ఇందులో రోజులు ఎనిమిది గంటల పాటు నీటిలోనే ఉన్నాను. అలాగే మట్టి బురదలో పేరుకుపోయే ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది. అది కూడా రియల్‌గా చేయించారు.  ఇందులో డ్యాన్స్ కూడా ఉంది. ఆ డ్యాన్స్ చేసినప్పుడు హిప్ ఇంజ్యూర్ అయింది. డాక్టర్ స్కాన్ చూసి ఇది ఏదో ఫుట్‌బాల్ ప్లేయర్‌కి ఇంజ్యూరీ అయినట్టుగా ఉంది అని చెప్పారు. మా డైరెక్టర్ గారు అంతా రియల్‌గా చేయించారు.(నవ్వుతూ). మా డైరెక్టర్ గారి విజన్ కి కావాల్సిన సపోర్ట్ చేశాను. మేము చాలా హార్డ్ వర్క్ చేసిన సినిమా ఇది. మీకు కచ్చితంగా నచ్చుతుందని నమ్మకం ఉంది.

డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కథ రాస్తున్నప్పుడే రష్మిక గారు హీరోయిన్‌గా చేయాలని ఫిక్స్ అయిపోయాను.  ‘సీతారామం’లో నేను పని చేశాను. అప్పుడే తను నా కొత్త హీరోయిన్ అనుకున్నాను. ఇప్పటివరకు మీరు క్యూట్‌గా, స్వీట్‌గా ఉండే రష్మికను చూశారు. ఈ సినిమాలో రష్మిక ఫేస్ మీద బ్లడ్ పెడితే ఎలా ఉంటుందో అది చూస్తారు.

ప్రొడ్యూసర్ అజయ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రష్మిక గారు ఈ సినిమా కోసం ప్రాణాలు పెట్టి పని చేశారనిపిస్తుంది. కొన్ని కొన్ని స్టంట్స్ చేయడానికి లైఫ్‌ని కూడా రిస్క్ చేశారు. అద్భుతంగా వచ్చింది.గాయం కాకపోయి ఉంటే ఈపాటికి సినిమా పూర్తి అయిపోయేది. చాలా దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ సినిమాని షూట్ చేశాం. చాలా గాయాలు కూడా అయ్యాయి. అలాంటి ప్రాంతాల్లో షూట్ చేయడం మామూలు విషయం కాదు. రష్మిక గారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని యాక్షన్ సీక్వెన్స్‌లలో చేశారు. చాలా పీక్ సమ్మర్‌లో కేరళలో షూట్ చేశాం. అలాంటి వాతావరణంలో షూట్ చేయడం మామూలు విషయం కాదు. అలాగే మా డైరెక్టర్ రవీంద్ర గారు చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. కచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

నటీనటులు: రష్మిక, ఈశ్వరి రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్, శివ కందుకూరి, కార్తిక్ రంజిని, తారక్ పొన్నప్ప, నిధి సింగ్

టెక్నికల్:
రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లే
నిర్మాతలు: అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ
మ్యూజిక్ డైరెక్టర్: జేక్స్ బిజోయ్
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: జి.ఎం. శేఖర్
యాక్షన్: కేచ
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: మనోజ్ వల్లూరి
డిజిటల్ ఏజెన్సీ: హ్యాష్‌ట్యాగ్ మీడియా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here