మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడీ` చిత్రాన్ని సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రొడక్షన్ చివరిదశలో ఉంది.
ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూడవపాట “అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే.. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికే`ను విడుదలచేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్ కు ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు సింగర్ సమీరా భరద్వాజ్ తో కలిసి స్వయంగా ఆలపించారు. దీనికి లిరిసిస్ట్ శ్రీమణి మాస్ ఆడియన్స్ కి నచ్చేలా సాహిత్యం రాశారు.
‘అట్టా సూడకే’ పాటలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ – మీనాక్షి చౌదరీ ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.
నిర్మాతలు ముందుగా ప్రకటించినట్టుగానే ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది.
బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదల కాగా.. విశేషమైన స్పందన లభించింది.
సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా.. అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు: రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్
సాంకేతిక బృందం
కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
బ్యానర్: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
ప్రొడక్షన్: ఏ హవీష్ ప్రొడక్షన్
సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
స్క్రిప్ట్ కో ఆర్టినేషన్: పాత్రికేయ
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు
డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్
ఎడిటర్: అమర్ రెడ్డి
లిరిక్స్: శ్రీ మణి
స్టిల్స్: సాయి మాగంటి
మేకప్: ఐ శ్రీనివాసరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి
ప్రొడక్షన్ హెడ్: పూర్ణ కండ్రు
పబ్లిసిటీ: రామ్ పెద్దిటి సుధీర్
కో డైరెక్టర్: పవన్ కేఆర్కే
ఆర్ట్: గాంధీ నడికుడికర్



