కరోనా విపత్తు నిధికి ఎస్.ఎస్. రాజమౌళి, డివివి ఎంటర్టైన్మెంట్స్ విరాళం…..!!

0
640
Rajamouli And DVV Danayya Contributed 10 Lakhs To CCC

ఇటీవల కరోనా వ్యాధి ఎఫెక్ట్ తో మన దేశంతో పాటు దాదాపుగా చాలా దేశాలన్నీ కూడా పూర్తిగా ప్రజలకు ఇళ్లకే పరిమితం చేస్తూ లాకౌట్ ప్రకటించడం జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్ వలన కరోనా వ్యాప్తిని త్వరితగతిన అరికట్టవచ్చని భావించి దేశాలన్నీ కూడా ఈ విధానాన్ని అమలు చేసాయి. అయితే దీనివలన మిగతా వర్గాల వారితో పాటు అట్టడుగు వర్గాల వారు కూడా పూర్తిగా ఇళ్లకే అంకితం అయి, చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక నానా అవస్థలు పడే పరిస్థితులు తలెత్తాయి.

ఇక అటువంటి వారిని ఆదుకోవడానికి కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఆర్ధిక ప్యాకెజీని ప్రకటిస్తున్నప్పటికీ, ఈ విపత్కర సమయంలో ప్రజలను ఆదుకోవడం మా ధర్మం అంటూ పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా మన టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుండి కూడా ఇప్పటికే ఎందరో ప్రముఖులు విరాళాలు అందించగా, నేడు కాసేపటి క్రితం టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థైన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు కరోనా విపత్తు నిధికి మొత్తంగా రూ.10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. నిత్యం మన కోసం శ్రమిస్తున్న కార్మికుల కోసం మా వంతుగా ఈ సాయం అందిస్తున్నాం అని వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెల్పడం జరిగింది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here