త్వరలోనే బిగిల్ తెలుగు విజిల్ ట్రైలర్

0
691

టాలీవుడ్ ఆడియెన్స్ ని మెప్పించేందుకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి తన బిగ్ బడ్జెట్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నాడు. గతంలో తుపాకీ -మెర్సల్ – సర్కార్ సినిమాలతో పాజిటివ్ కలెక్షన్స్ అందుకున్న ఇళయథలపతి విజయ్ ఇప్పుడు బిగిల్ తో తెలుగులో స్ట్రాంగ్ విజిల్ వేయబోతున్నాడు. ఇప్పటికే సినిమా సౌండ్ తెలుగులో కూడా గట్టిగానే ఉంది. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు బిగిల్ ని తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు.

అయితే తెలుగులో విజిల్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా పెంచేందుకు మహేష్ సిద్దమయ్యారు. ఇటీవల తమిళ్ ట్రైలర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ ఆడియేన్స్ కూడా విజిల్ ట్రైలర్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై స్పంధించిన మహేష్ త్వరలోనే సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. అలాగే తెలుగులో సినిమాలోని మొదటి పాటను కూడా వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్లు వివరణ ఇచ్చారు.

ఈ వీక్ ఎండింగ్ లొనే బిగిల్ తెలుగులో కూడా విజిల్ గా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బిగ్ బడ్జెట్ మూవీని AGS ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ లో నిర్మించారు. సినిమా కోసం దాదాపు 180కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాతలు తెలియజేశారు. నయనతార కథానాయికగా నటించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక సినిమా అక్టోబర్ ఏండింగ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here