100 కోట్ల కలెక్షన్స్ తో సూర్య బాక్స్ ఆఫీస్ హిట్

0
3793

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి కాప్పాన్ మంచి సక్సెస్ ని ఇచ్చింది. కెవి ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక అంతకుముందే ట్రైలర్ సాంగ్స్ కాంబినేషన్ పై అంచనాల డోస్ ని పెంచాయి.

ఫైనల్ గా సినిమా ఇటీవల తమిళ్ లో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ లైకాప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. గతంలో సూర్య – కెవి.ఆనంద్ కాంబినేషన్ లో వచ్చిన వీడోక్కడే – బ్రదర్స్ సినిమాలకంటే కూడా కాప్పాన్ సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుంది. తెలుగులో ఈ సినిమా బందోబస్త్ గా రిలీజైన సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ రీసెంట్ గా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది.

లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో సూర్యతో పాటు మోహన్ లాల్ – ఆర్య కూడా ముఖ్య పాత్రలో కనిపించారు. సాయేషా సైగల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా అనంతరం సూర్యా సుధా కొంగరా దర్శకత్వంలో చేసిన సురారై పోట్రు షూటింగ్ ని ఫినిష్ చేశాడు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. టాలీవుడ్ సీనియర్ యాక్టర్, హీరో మోహన్ బాబు ఆ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here